ప్రతికూల పరిస్థితులను తట్టుకుని, అధిక దిగుబడులనిచ్చే పంటల అభివృద్ధి కోసం హైదరాబాద్‌లోని అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల వ్యవసాయ పరిశోధన సంస్థ(ఇక్రిశాట్)కు ఆర్థికసాయం అందించేందుకు జర్మనీకి చెందిన జీవవైవిధ్య సంస్థ క్రాప్‌ట్రస్టు ముందుకొచ్చింది. ఈ రెండు సంస్థల మధ్య తాజాగా దిల్లీలో ఒప్పందం కుదిరింది. దీనిపై ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ హిమాన్ష్ పాఠక్, క్రాప్‌ట్రస్టు శాస్త్ర, కార్యక్రమాల డైరెక్టర్ శారదాకృష్ణన్‌లు సంతకాలు చేశారు.