స్మార్ట్‌ఫోన్ల స్క్రీన్‌లకు రక్షణ కల్పించే టెంపర్డ్‌గ్లాస్‌లకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రమాణాలు నిర్దేశించింది. ఇవి ఐఎస్ 19348:2025 ప్రకారమే ఉండాలని స్పష్టంచేస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ 2026, సెప్టెంబరు 22న నోటిఫికేషన్ జారీచేసింది. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ‘ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గూడ్స్ (రిక్వయిర్‌మెంట్ ఆఫ్ కంపల్సరీ రిజిస్ట్రేషన్) ఆర్డర్ 2021లో ఈమేరకు సవరణలు చేసినట్లు పేర్కొంది. ఈ కొత్త ప్రమాణాలు 2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.