ప్రజా పంపిణీ వ్యవస్థలోని ‘సార్థక్-పీడీఎస్’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఐదేళ్లు పొడిగించింది. రూ.25,530 కోట్లు వ్యయమయ్యే ఈ పథకం 2031 మార్చి వరకూ కొనసాగనుంది. 2026, మే 27న ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ పథకానికి ఆమోదం తెలిపింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య ఆహార ధాన్యాల రవాణా, నిర్వహణలో కేంద్ర సాయాన్ని నియంత్రించే నిబంధనల సవరణలకూ సీసీఈఏ ఆమోదం తెలిపింది.