అక్రమ వలసలపై కమిటీ

అక్రమ వలసలపై కమిటీ
  • అక్రమ వలసలు తదితర కారణాల వల్ల దేశ జనాభాలో చోటుచేసుకుంటున్న అసహజ మార్పుల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ ప్రకాశ్‌ ప్రభాకర్‌ నావోలేకర్‌ అధ్యక్షత ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా 2026, మే 26న ప్రకటించారు.
  • జనాభా లెక్కల కమిషనరుతోపాటు మాజీ ఐఏఎస్‌ అధికారి దుర్గాశంకర్‌ మిశ్ర, మాజీ ఐపీఎస్‌ అధికారి బాలాజీ శ్రీవాస్తవ, ప్రధానమంత్రి ఆర్థికసలహా మండలి సభ్యురాలు డాక్టర్‌ శమికా రవి సభ్యులుగా ఉంటారని వెల్లడించారు. హోం మంత్రిత్వశాఖలోని విదేశీ వ్యవహారాల జాయింట్‌ సెక్రటరీ కమిటీకి సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. నివేదిక అందించడానికి కమిటీకి ఏడాది గడువు ఇచ్చారు. అవసరమైతే మరో ఆరు నెలలు పొడిగించే వెసులుబాటు ఉంటుంది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram