దక్షిణ మధ్య రైల్వేజోన్‌లో జూన్ 1 నుంచి భారీగా పరిపాలన మార్పులు అమల్లోకి రానున్నాయి. సికింద్రాబాద్‌లోని రైలు నిలయం కేంద్రంగా ఇప్పుడున్న 6 డివిజన్లతో కార్యకలాపాలు మే 31 వరకే కొనసాగనున్నాయి. ఇక ద.మ. రైల్వేజోన్‌లో డివిజన్ల సంఖ్య 3 (సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్)కి తగ్గనుంది. దీంతో పరిపాలనా భారం కొంత తగ్గనున్నప్పటికీ.. సికింద్రాబాద్ డివిజన్ పరిధి గణనీయంగా పెరగనుంది. జోన్ పరిధి 6,637 ట్రాక్ కి.మీ. నుంచి 3,589 ట్రాక్ కి.మీ.కి పరిమితం కానుంది.