సుప్రీం కోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34 నుంచి 38కి (ప్రధాన న్యాయమూర్తితో కలిపి) పెరిగింది. న్యాయమూర్తుల సంఖ్య పెంపునకు ఆమోదం తెలుపుతూ మే 5న కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దాన్ని కార్యరూపంలోకి తెస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ‘ద సుప్రీం కోర్టు (నంబర్ ఆఫ్ జడ్జెస్) ఎమెండ్‌మెంట్ ఆర్డినెన్స్-2026’ను జారీ చేశారు.