సీబీఎస్‌ఈలో త్రిభాషా సూత్రం

సీబీఎస్‌ఈలో త్రిభాషా సూత్రం
  • 2026, జులై 1 నుంచి 9వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలు అభ్యసించాలని కేంద్ర సెకండరీ విద్యా బోర్డు (సీబీఎస్‌ఈ) నిర్ణయించింది. ఇందులో భాగంగా 2026-27 విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతి విద్యార్థులు రెండు భారతీయ భాషలతో పాటు మొత్తం మూడు భాషలు తప్పని సరిగా చదవాలని బోర్డు స్పష్టం చేసింది. ఏదైనా విదేశీ భాషను చదవాలని కోరుకునే విద్యార్థులు తృతీయ భాషగా మాత్రమే దాన్ని ఎంపిక చేసుకోవచ్చు.
  • మొదటి రెండు భాషలూ తప్పనిసరిగా భారతీయ భాషలై ఉంటాయని సీబీఎస్‌ఈ పేర్కొంది. నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) - 2020, పాఠశాల విద్య జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం - 2023లకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీబీఎస్‌ఈ పేర్కొంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram