దేశంలో డిజిటల్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కొత్తగా ‘అభయ్’ పేరుతో ఏఐ ఆధారిత నోటీస్ వెరిఫికేషన్ వ్యవస్థను తీసుకొచ్చింది. ఇటీవలి కాలంలో సైబర్ మోసగాళ్లు సీబీఐ పేరుతో నోటీసులు పంపి డిజిటల్ అరెస్టుల పేరుతో బెదిరిస్తున్న నేపథ్యంలో ప్రజలు వాటిని ధ్రువీకరించుకునేందుకు ఈ కొత్త వ్యవస్థను తీసుకొచ్చినట్లు అధికారులు 2026, మే 15న తెలిపారు.