‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం

‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం
  • వివిధ రంగాల్లో విశేష సేవలందించేవారికి ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘పద్మ’ అవార్డుల తొలి విడత ప్రదానోత్సవô 2026, మే 25న రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో 66 మంది.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు. వీరిలో ఇద్దరు పద్మవిభూషణ్, ఆరుగురు పద్మభూషణ్, 58 మంది పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు. భారత చలనచిత్ర రంగానికి విశేష సేవలు అందించిన బాలీవుడ్‌ నటుడు ధర్మేంద్రకు మరణానంతరం ప్రకటించిన పద్మవిభూషణ్‌ అవార్డును ఆయన సతీమణి హేమమాలిని స్వీకరించారు. 
  • శాస్త్రీయ సంగీతకారిణి, వయొలిన్‌ విద్వాంసురాలు ఎన్‌.రాజం... పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. పద్మభూషణ్‌ అవార్డు స్వీకరించిన వారిలో ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం భగత్‌ సింగ్‌ కోశ్యారీ, శతావధాని ఆర్‌.గణేశ్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వ్యవస్థాపకుడు ఉదయ్‌ సురేశ్‌ కుమార్‌ కోటక్, జీర్ణ కోశ వ్యాధి నిపుణుడు కల్లిపట్టి రామస్వామి పళనిస్వామి ఉన్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram