వాషింగ్టన్ (అమెరికా)లోని సియాటిల్‌లో అత్యంత రద్దీ ప్రాంతమైన వెస్ట్‌లేక్ స్క్వేర్‌వద్ద ప్రఖ్యాత భారతీయ తత్వవేత్త, ఆధ్యాత్మిక గురువు స్వామి వివేకానంద కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అమెరికాలో స్వామి వివేకానంద నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. భారత కళాకారుడు నరేశ్ కుమార్ కుమావత్ రూపొందించిన ఈ విగ్రహాన్ని సియాటిల్ నగరానికి భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి (ఐసీసీఆర్) బహుమతిగా అందించింది.