జస్టిస్‌ లావు నాగేశ్వరరావు

జస్టిస్‌ లావు నాగేశ్వరరావు
  • లండన్‌లోని నాలుగు చారిత్రక కోర్ట్‌ ఇన్‌లలో ఒకటైన ఇన్నర్‌ టెంపుల్‌ గౌరవ బెంచర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ఎంపికయ్యారు. దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రతీక్‌ జలాన్‌ (2023) తర్వాత ఈ పదవికి ఎంపికైన రెండో భారతీయుడు ఆయన. ఈ పదవికి విశిష్టమైన న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయకోవిదులు, రాజనీతిజ్ఞులను న్యాయ వ్యవస్థకు వారు చేసిన సేవలకు గుర్తింపుగా ప్రస్తుతమున్న బెంచర్లు ఎంపిక చేస్తారు.
  • జస్టిస్‌ లావు నాగేశ్వరరావు గుంటూరు జిల్లాలో, ఏపీ హైకోర్టులో, తర్వాత సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. 2016 నుంచి 2022 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram