చందమామ ఉపరితలం.. రెండు పొరల నిర్మాణం

చందమామ ఉపరితలం.. రెండు పొరల నిర్మాణం

చంద్రుడి ఉపరితలం మొత్తం ఒకే ధూళి కుప్పలా లేదని, అది కేక్‌ తరహాలో రెండు పొరలతో కూడి ఉందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది. చంద్రయాన్‌-3 మిషన్‌కు సంబంధించిన విక్రమ్‌ ల్యాండర్‌ నిర్వహించిన ఒక ప్రయోగంలో ఇది వెల్లడైందని వివరించింది. చంద్రుడి ఉపరితలం నిరంతరం చిన్నపాటి ఉల్కల ఢీకి లోనైందని ఈ రెండు పొరలు స్పష్టంచేస్తున్నాయి. జాబిల్లి పైపొర గట్టిపడినప్పటి నుంచి ఇదే పరిస్థితి నెలకొందని ఇస్రో తెలిపింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram