బీఎస్‌ఈ-2 హాట్‌ఫైర్‌ పరీక్ష

బీఎస్‌ఈ-2 హాట్‌ఫైర్‌ పరీక్ష
  • హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ ‘అబ్యోమ్‌ స్పేస్‌టెక్‌ అండ్‌ డిఫెన్స్‌’ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పునర్వినియోగ రాకెట్‌ లిక్విడ్‌ ఇంజిన్‌ బీఎస్‌ఈ-2 హాట్‌ఫైర్‌ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. 2.5 కిలో న్యూట్రన్ల థ్రస్ట్‌ సామర్థ్యం గల ఇంజిన్‌ను పరీక్షలో 6 సెకన్లపాటు నిరంతరాయంగా మండించారు. ఈ క్రమంలో ఛాంబర్‌ ఉష్ణోగ్రత 2,200 డిగ్రీల సెల్సీయస్‌ను దాటినా ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ఇంజిన్‌ అత్యుత్తమ పనితీరును కనబరిచింది.
  • బిట్స్‌ పిలానీ క్యాంపస్‌లోని టెస్ట్‌ సెంటర్‌లో ఇప్పటివరకు 250కి పైగా హాట్‌ఫైర్‌ ఇంజిన్‌ పరీక్షలు నిర్వహించింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram