తిరుపతిలో పశుసంవర్ధక డిప్లొమా ప్రవేశాల నోటిఫికేషన్ (2026-27)

తిరుపతిలో పశుసంవర్ధక డిప్లొమా ప్రవేశాల నోటిఫికేషన్ (2026-27)

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం (ఎస్‌వీవీయూ), తిరుపతి, 2026-27 విద్యాసంవత్సరానికి గాను 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ యానిమల్ హస్బెండ్రీ (పశుసంవర్ధక డిప్లొమా) కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  

వివరాలు:

యానిమల్ హస్బెండ్రీ (పశుసంవర్ధక) పాలిటెక్నిక్‌లో రెండేళ్ల డిప్లొమా కోర్సు 2026-27

సీట్ల సంఖ్య:

యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు (10 కళాశాలలు): 330 సీట్లు (300 సాధారణ + 30 ఈడబ్ల్యూఎస్‌ సీట్లు; ప్రతి కళాశాలకు 30 సీట్లు).

అనుబంధ (ప్రైవేట్) పాలిటెక్నిక్‌లు (12 కళాశాలలు): 660 సీట్లు (600 సాధారణ + 60 ఈడబ్ల్యూఎస్‌ సీట్లు; ప్రతి కళాశాలకు 50 సీట్లు)

మొత్తం సీట్లు: 990.

కోర్సు వ్యవధి: రెండేళ్లు.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: పదవ తరగతి లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా 10వ తరగతిలో సాధించిన మార్కుల అగ్రిగేట్ (లేదా ఓవరాల్ గ్రేడ్ పాయింట్ యావరేజ్), రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా జరుగుతుంది.

వయోపరిమితి: 31-08-2026 నాటికి 15 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే అభ్యర్థులు 01-09-2004 నుంచి 31-08-2011 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు రుసుము: జనరల్ కేటగిరీ, బీసీ కేటగిరీలకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.550.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.06.2026.

Website:https://www.svvu.edu.in/Default.aspx

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram