సంప్రదాయ కలంకారీ కళలో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు

సంప్రదాయ కలంకారీ కళలో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు

తిరుమల తిరుపతి దేవస్థానాలు(తితిదే) పరిధిలోని శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప కళాశాల.. 2026-27 విద్యా సంవత్సరానికి డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి కల్పిస్తారు. శిక్షణలో చేరిన విద్యార్థి పేరు మీద తితిదే రూ.లక్ష బ్యాంకులో డిపాజిట్‌ చేస్తుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి ఆ మొత్తాన్ని అందిస్తుంది.

వివరాలు:

1. నాలుగేళ్ల డిప్లొమా కోర్సు (సంప్రదాయ కలంకారీ కళ)

2. రెండేళ్ల సర్టిఫికేట్ కోర్సు (సంప్రదాయ కలంకారీ కళ) 

అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత.

దరఖాస్తులు ప్రారంభం: 04.05.2026

దరఖాస్తులకు చివరి తేది: 20.06.2026.

వివరాలకు ఫోన్‌ నంబర్‌: 0877-2264637

Website:https://www.tirumala.org/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram