ఐసీఎంఆర్- ఎన్‌హెచ్‌ఆర్‌లో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు

ఐసీఎంఆర్- ఎన్‌హెచ్‌ఆర్‌లో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు

ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ రిసెర్చ్ భువనేశ్వర్ (ఐసీఎంఆర్- ఎన్‌హెచ్‌ఆర్‌), తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ కన్సల్టెంట్, యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 12

వివరాలు:

1. జూనియర్ కన్సల్టెంట్ (మెడికల్) - 03  

2. యంగ్ ప్రొఫెషనల్-I (పబ్లిక్ హెల్త్) - 06  

3. యంగ్ ప్రొఫెషనల్-II (ఐటీ) - 01  

4. యంగ్ ప్రొఫెషనల్-I (అడ్మిన్) - 01  

5. యంగ్ ప్రొఫెషనల్-I (అకౌంట్స్) - 01

అర్హత: పోస్టులను బట్టి గ్రాడ్యుయేషన్ (బీకామ్‌/బీబీఏ/ఇతర గ్రూపులు), పీజీ (లైఫ్ సైన్సెస్/పబ్లిక్ హెల్త్/టెక్నాలజీ/ఐటీ/కంప్యూటర్ సైన్స్), ఎంబీబీఎస్/బీడీఎస్/బీవీఎస్‌సీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో ఉద్యోగానుభవం ఉండాలి.

వేతనం: పోస్టులను బట్టి నెలకు రూ.35,000 నుంచి రూ.80,000 వరకు 

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీలు: 2026 మే 28 నుంచి 2026 జూన్‌ 3 తేదీ వరకు. 

వేదిక: యానెక్స్ బిల్డింగ్ ఆఫ్ ఐసీఎంఆర్ - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ రిసెర్చ్, చంద్రశేఖర్‌పూర్, భువనేశ్వర్, ఒడిశా - 751023.

Website:https://www.icmr.gov.in/employment-opportunities

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram