ఈఎస్‌ఐసీ వారణాసిలో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు

ఈఎస్‌ఐసీ వారణాసిలో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) మెడికల్ కాలేజ్ అండ్‌ హాస్పిటల్, వారణాసి వివిధ విభాగాలలో ఒప్పంద ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్,  సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 45   

వివరాలు:

1. ప్రొఫెసర్: 16   

2. అసోసియేట్ ప్రొఫెసర్: 09   

3. అసిస్టెంట్ ప్రొఫెసర్: 08   

4. సీనియర్ రెసిడెంట్: 12   

విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ & టాక్సికాలజీ, కమ్యూనిటీ మెడిసిన్ స్టాటిస్టీషియన్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, సైకియాట్రీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ తదితర విభాగాలు.  

అర్హత: సంబంధిత విభాగాల్లో ఎండీ/ఎంఎస్/పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.  

గరిష్ఠ వయోపరిమితి: టీచింగ్ ఫ్యాకల్టీకి 69 ఏళ్లు, సీనియర్ రెసిడెంట్ అభ్యర్థులకు 45 ఏళ్లు (నాన్-క్లినికల్ సబ్జెక్టులకు 50 ఏళ్లు) మించకూడదు.  

వేతనం: నెలకు ప్రొఫెసర్ కు రూ.1,23,100 , అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ.78,800 , అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రూ.67,700 , సీనియర్ రెసిడెంట్ కు రూ.67,700 (ఇతర అలవెన్సులు అదనం).  

ఎంపిక ప్రక్రియ: అకడమిక్ క్రెడెన్షియల్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.  

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/మహిళలు/ఎక్స్-సర్వీస్‌మెన్/ఈఎస్‌ఐసీ (రెగ్యులర్ ఉద్యోగులు) / పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. మిగిలిన వారికి రూ.500. 

ఇంటర్వ్యూ తేదీలు: 2026 మే 29, 30.  

వేదిక: డీన్ కార్యాలయం, 2వ అంతస్తు, ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్, పాండేపూర్, వారణాసి (ఉత్తర్‌ ప్రదేశ్) - 221002.  

Website:https://www.esic.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram