డీఆర్‌డీఓ డీజీ (ఏరోనాటికల్‌ సిస్టమ్‌)లో పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

డీఆర్‌డీఓ డీజీ (ఏరోనాటికల్‌ సిస్టమ్‌)లో పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌ పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ), డైరెక్టర్ జనరల్ (ఏరోనాటికల్ సిస్టమ్స్) పరిధిలోని ల్యాబ్‌లలో పెయిడ్ ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2026-27 కొరకు ప్రకటన విడుదల చేసింది. ఇంజినీరింగ్ లేదా సైన్స్ స్ట్రీమ్స్‌లో ఫైనల్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 200.

వివరాలు:

1. ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ADE), బెంగళూరు: 69 ఖాళీలు

2. సెంటర్ ఫర్ ఎయిర్‌బోర్న్ సిస్టమ్స్ (CABS), బెంగళూరు: 60 ఖాళీలు

3. గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (GTRE ), బెంగళూరు: 31 ఖాళీలు   

4. ఏరియల్ డెలివరీ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ADRDE ), ఆగ్రా: 20 ఖాళీలు

5. సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్‌వర్దినెస్ అండ్ సర్టిఫికేషన్ (CEMILAC), బెంగళూరు: 20 ఖాళీలు.

విభాగాలు: సీఎస్‌ఈ/ఐటీ, ఏరో, మెకానికల్, ట్రిపుల్‌ఈ, ఈసీఈ, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, మెటలార్జీ, కెమికల్‌ ఇంజినీరింగ్‌, డేటా సైన్స్‌ టెక్స్‌టైల్‌/పాలీమర్‌ సైన్స్‌ తదితరాలు.

అర్హత: ఇంజినీరింగ్ లేదా సైన్స్ స్ట్రీమ్‌కు చెందిన ఫైనల్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ (UG) లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) విద్యార్థులై ఉండాలి. కనీసం 6.5 సీజీపీఏ కలిగి ఉండటం తప్పనిసరి. యూజీ విద్యార్థులు 6వ సెమిస్టర్ మార్క్‌షీట్, పీజీ విద్యార్థులు 2వ సెమిస్టర్ మార్క్‌షీట్ సమర్పించాల్సి ఉంటుంది.  

స్టైపెండ్‌: ఆరు నెలలకు రూ.30,000. 

ఎంపిక విధానం: విద్యార్హతల మార్కుల ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ: 25.05.2026.

దరఖాస్తు విధానం: అర్హత గల అభ్యర్థులు అధికారిక లింక్ నుంచి అప్లికేషన్ ఫార్మాట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి వివరాలు నింపాలి. పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్‌పై విద్యార్థి, వారి కాలేజీ హెచ్ఓడి /ప్రిన్సిపాల్ సంతకం చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫారమ్‌తో పాటు అవసరమైన పత్రాలను (రెజ్యూమె, కాలేజీ పర్మిషన్ లెటర్, ఆధార్ కార్డ్ కాపీ, మార్క్‌షీట్స్) పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో సిద్ధం చేసుకుని దరఖాస్తు చేయాలనుకుంటున్న ల్యాబ్ అధికారిక ఈమెయిల్ ఐడీకి మెయిల్ చేయాలి. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ల్యాబ్‌లకు అప్లై చేయాలనుకుంటే విడివిడిగా అప్లికేషన్లు పంపంచాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేదీ: 05.06.2026

Website:https://drdo.gov.in/drdo/en

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram