డీఆర్‌డీఓ-ఆర్‌ అండ్‌ డీఈలో ఇంటర్న్‌షిప్ పోస్టులు

డీఆర్‌డీఓ-ఆర్‌ అండ్‌ డీఈలో ఇంటర్న్‌షిప్ పోస్టులు

డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ)- రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఇంజినీర్స్) [ఆర్‌ అండ్‌ డీఈ], పూణెలో తాత్కాలిక ప్రాతిపదికన పెయిడ్ ఇంటర్న్‌షిప్/ప్రాజెక్ట్ వర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

వివరాలు:

పెయిడ్ ఇంటర్న్‌షిప్ - 40

అర్హత: ఫుల్ టైమ్ బీఈ/బీటెక్ (7వ లేదా 8వ సెమిస్టర్ చదువుతున్నవారు) లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ (ఎమ్మెస్సీ/ఎంటెక్ 2వ సంవత్సరం చదువుతున్నవారు) అయి ఉండాలి. సంబంధిత సబ్జెక్టుల్లో (మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ తదితర విభాగాలు) ఉత్తీర్ణత మార్కులు కలిగి ఉండాలి.

వేతనం: నెలకు బీఈ/బీటెక్  అభ్యర్థులకు రూ.8,000; ఎమ్మెస్సీ/ఎంటెక్  అభ్యర్థులకు రూ.9,000 స్టైపెండ్ చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ: మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: ది డైరెక్టర్, రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ కలస్, ఆలంది రోడ్, దిఘి, పూణె, మహారాష్ట్ర - 411015.

దరఖాస్తు చివరి తేదీ: 27.05.2026.

Website:https://xn--m1b0a2bb8esed.xn--11b7cb3a6a.xn--h2brj9c/drdo/hi/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram