పంజాబ్‌ అండ్‌ సింథ్‌ బ్యాంక్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

పంజాబ్‌ అండ్‌ సింథ్‌ బ్యాంక్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

భారత ప్రభుత్వ రంగానికి చెందిన పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (పీఎస్‌బీ) దేశవ్యాప్తంగా అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 635 (ఇందులో తెలంగాణలో 20, ఆంధ్రప్రదేశ్‌లో 20 ఖాళీలు ఉన్నాయి).  

వివరాలు:

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 01.05.2026 నాటికి కనీసం 20 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ఠంగా 28 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఇతరులకు 5 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

స్టైపెండ్‌: నెలకు రూ.12,300. 

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.250, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో మెరిట్‌ ఆధారంగా.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 2026 మే 21.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 జూన్‌ 6.

Website:https://punjabandsind.bank.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram