ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

ఆయిల్ ఇండియా లిమిటెడ్, గ్రేడ్‌-ఎ, గ్రేడ్-బీ, గ్రేడ్‌-సీ విభాగాలలోని వివిధ పోస్టుల భర్తీ కోసం భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • మొత్తం పోస్టులు: 32

వివరాలు:

  • సూపరింటెండింగ్ రీసెర్చ్ సైంటిస్ట్ -05

  • సీనియర్ ఆఫీసర్ - మెకానికల్- 14

  • సీనియర్ ఆఫీసర్ - పెట్రోలియం- 04

  • సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ / సీనియర్ ఇంటర్నల్ ఆడిటర్- 06

  • హిందీ ఆఫీసర్ - అఫీషియల్ లాంగ్వేజ్- 02

  • కాన్ఫిడెన్షియల్ సెక్రటరీ-01

అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత విద్యార్హత కలిగి ఉండాలి. పోస్టును బట్టి పీహెచ్‌డీ (కెమిస్ట్రీ / జియాలజీ / కెమికల్ ఇంజినీరింగ్ / పెట్రోలియం ఇంజినీరింగ్) తో పాటు 4 సంవత్సరాల అనుభవం, లేదా కనీస మార్కులతో బీఈ/బీటెక్ (మెకానికల్), లేదా పెట్రోలియం ఇంజనీరింగ్/టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ, లేదా ICAI/ICMAI అసోసియేట్ మెంబర్‌షిప్, లేదా హిందీ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ (3 ఏళ్ల అనుభవం), లేదా సెక్రటేరియల్ ప్రాక్టీస్/ఆఫీస్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమాతో పాటు గ్రాడ్యుయేషన్ (2 ఏళ్ల అనుభవం) ఉండాలి.

వయోపరిమితి: బట్టి గరిష్ఠ వయోపరిమితి 27 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం: నెలకు రూ. ప్రారంభ వేతనం రూ. 50,000 నుంచి రూ.2,20,000 వరకు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: స్కిల్ టెస్ట్‌, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు రుసుము: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఈడబ్ల్యూఎస్‌/ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రుసుము లేదు (Nil)

ఓబీసీ/ఇతరులు (Others): రూ.500/-

దరఖాస్తు చివరి తేదీ: 14.12.2026

Website: https://www.oil-india.com/careeroil

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram