బీహెచ్‌ఈఎల్‌ బెంగళూరులో ప్రాజెక్ట్ ఇంజినీర్/సూపర్‌వైజర్ పోస్టులు

బీహెచ్‌ఈఎల్‌ బెంగళూరులో ప్రాజెక్ట్ ఇంజినీర్/సూపర్‌వైజర్ పోస్టులు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్‌) ఎలక్ట్రానిక్స్ డివిజన్, బెంగళూరు ఫిక్స్‌డ్ టెన్యూర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • మొత్తం పోస్టులు: 64

వివరాలు:

  • ప్రాజెక్ట్ ఇంజనీర్ - 08 పోస్టులు

  • ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ / హిందీ ట్రాన్స్‌లేటర్ - 56 పోస్టులు

అర్హతలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు సంబంధిత విభాగంలో (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/మెకానికల్/సివిల్) ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ పోస్టులకు సంబంధిత బ్రాంచ్‌లో పూర్తిస్థాయి డిప్లొమా కలిగి ఉండాలి. హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుకు గ్రాడ్యుయేషన్‌లో హిందీ/ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా ఉండి హిందీ లేదా ఇంగ్లీష్‌లో మాస్టర్స్ డిగ్రీ (లేదా హిందీ & ఇంగ్లీష్ ప్రధాన సబ్జెక్టులుగా బ్యాచిలర్ డిగ్రీ) పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు, అన్ని పోస్టులకు విభాగాన్ని బట్టి కనీసం 1 నుంచి 2 సంవత్సరాల సంబంధిత పోస్ట్-క్వాలిఫికేషన్ పని అనుభవం తప్పనిసరి.

వయోపరిమితి: గరిష్ఠ వయోపరిమితి 32 సంవత్సరాలు.

జీతం: ప్రాజెక్ట్ ఇంజినీర్ మొదటి సంవత్సరం నెలకు రూ. 84,000/- రెండవ సంవత్సరం నెలకు రూ. 88,000/-
ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ / హిందీ ట్రాన్స్‌లేటర్: మొదటి సంవత్సరం నెలకు రూ. 45,000/-, రెండవ సంవత్సరం నెలకు రూ. 48,000/ వరకు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తు ఫీజు: జనరల్ /ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు: రూ. 236

ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగ (PwBD) అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు కలదు.

దరఖాస్తు చివరి తేదీ: 07.12.2026

Website: https://www.bhel.com/recruitment

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram