డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో నాన్-టెక్నికల్ ఉద్యోగాలు

డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో నాన్-టెక్నికల్ ఉద్యోగాలు

డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (డీఐసీ) పరిధిలోని నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (NeGD), 'సమ్మర్ ప్రోగ్రామ్ - 2026' వివిధ విభాగాలలో నాన్-టెక్నికల్ ఇంటర్న్‌షిప్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

వివరాలు:

నాన్-టెక్నికల్ ఇంటర్న్‌షిప్ (సమ్మర్ ప్రోగ్రామ్) - 13 ఖాళీలు

విభాగాలు: స్ట్రాటజిక్ ప్లానింగ్, డేటా అనలిటిక్స్, ఏఐ & మెషిన్ లెర్నింగ్, అవేర్‌నెస్ అండ్ కమ్యూనికేషన్ కెపాసిటీ బిల్డింగ్ తదితర విభాగాలు..

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా/డిగ్రీ పూర్తి చేసినవారు లేదా 10+2+4 విధానంలో ఇంజినీరింగ్ ప్రీ-ఫైనల్/ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు అర్హులు. 

ఇంటర్న్‌షిప్ కాలపరిమితి: కనీసం 02 నెలలు 

వేతనం: నెలకు రూ.15,000 స్టైపెండ్ లభిస్తుంది 

ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 07 జూన్ 2026 

Website:https://negd.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram