బీఎస్‌ఎన్‌ఎల్‌లో టెలికాం ఆఫీసర్‌ ఉద్యోగాలు

బీఎస్‌ఎన్‌ఎల్‌లో  టెలికాం ఆఫీసర్‌ ఉద్యోగాలు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్‌), ఓపెన్ మార్కెట్ నుంచి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన జూనియర్ టెలికాం ఆఫీసర్ (టెలికాం) కేడర్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:

జూనియర్ టెలికాం ఆఫీసర్‌: 100 (ఇందులో తెలంగాణ సర్కిల్‌లో 02 ఖాళీలు, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 01 ఖాళీ ఉన్నాయి).

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, లేదా ఎంఎస్సీ, ఎంటెక్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 2026 జులై 3వ తేదీ నాటికి 20 ఏళ్ల నుంచి 30 ఏళ్లు ఉండాలి. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

వేతనం: నెలకు రూ.16,400 - రూ.40,500.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.2,000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.1,000.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్ టెస్ట్‌ (సీబీటీ), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 2026 జూన్‌ 4.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 జులై 3.

దరఖాస్తు సవరణ తేదీ: 2026 జులై 4 నుంచి 11 వరకు.

పరీక్ష తేదీ: 2026 ఆగస్టు. 

Website:https://bsnl.co.in/aboutus/careers

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram