ఇండియన్ నేవీలో 10+2 (బీటెక్‌) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్

ఇండియన్ నేవీలో 10+2 (బీటెక్‌) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్

భారత నౌకాదళం (ఇండియన్ నేవీ) టెక్నికల్ బ్రాంచుల్లో పర్మనెంట్‌ కమిషన్‌ ఆఫీసర్ల కోసం 10+2 (బీటెక్‌) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కింద నాలుగేళ్ల బీటెక్‌ డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు ప్రతిష్టాత్మకమైన ఇండియన్ నావల్ అకాడమీ (ఐఎన్‌ఏ) ఎళిమలలో నాలుగేళ్ల బీటెక్ కోర్సు చదవవలసి ఉంటుంది. 

వివరాలు:

10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (పర్మనెంట్‌ కమిషన్)

ఖాళీలు: 60 (మహిళలకు మొత్తం 08 ఖాళీలు కేటాయించారు)

1. మెకానికల్ ఇంజినీరింగ్: 30 పోస్టులు (మహిళలకు గరిష్టంగా 04 ఖాళీలు కేటాయించారు).  

2. ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌: 30 పోస్టులు (మహిళలకు గరిష్టంగా 04 ఖాళీలు కేటాయించారు).  

గమనిక: శిక్షణ సమయంలో మెరిట్, అర్హత ఆధారంగా, 07 గురు అభ్యర్థులను కొచ్చిలోని ఎన్‌సీడబ్ల్యూలో బీటెక్ ఇన్ నావల్ ఆర్కిటెక్చర్ & షిప్‌బిల్డింగ్ కోర్సు కోసం ఎంపిక చేస్తారు.

కోర్సు ప్రారంభం: 2027 జనవరిలో.

వయోపరిమితి: 02 జులై 2007 నుంచి 01 జనవరి 2010 మధ్య జన్మించిన వారై ఉండాలి.

అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులలో కనీసం 70% మార్కుల అగ్రిగేట్‌తో సీనియర్ సెకండరీ పరీక్ష (10+2 విధానం) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, పదో తరగతి లేదా పన్నెండో తరగతిలో ఇంగ్లిష్ సబ్జెక్టులో కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి. వీటితో పాటు, జేఈఈ (మెయిన్‌)-2026 పరీక్షకు (బీఈ/బీటెక్‌ కొరకు) హాజరైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: జేఈఈ మెయిన్‌ 2026 ఆల్ ఇండియా కామన్ ర్యాంక్ లిస్ట్ (సీఆర్ఎల్‌) ఆధారంగా అభ్యర్థులను ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూకి షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. తరువాత వైద్య పరీక్షలు (Medical Examination) జరుగుతాయి. మార్కులు, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా తుది మెరిట్ జాబితా తయారు చేస్తారు.

4 ఏళ్ల బి.టెక్ కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి బీటెక్ డిగ్రీ సర్టిఫికేట్ ప్రాదానం చేస్తారు.

పరీక్షా కేంద్రాలు: షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు సెప్టెంబర్ 2026 నుంచి బెంగళూరు, భోపాల్, కోల్‌కతా, విశాఖపట్నం కేంద్రాలలో నిర్వహిస్తారు. 

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రాంరంభం: 29.05.2026.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18.06.2026.

Website:https://www.joinindiannavy.gov.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram