ఎడ్‌సిల్‌ లిమిటెడ్‌లో మల్టీ-డిసిప్లినరీ స్టాఫ్ పోస్టులు 

ఎడ్‌సిల్‌ లిమిటెడ్‌లో మల్టీ-డిసిప్లినరీ స్టాఫ్ పోస్టులు 

భారత ప్రభుత్వానికి చెందిన మినీ రత్న కేటగిరీ-I సీపీఎస్‌ఈ అయిన ఎడ్‌సిల్ (ఇండియా) లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ రకాల మల్టీ-డిసిప్లినరీ స్టాఫ్, పీఎంయూ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ మునిసిపాలిటీలలో ఉన్న ఆటిజం సెంటర్లలో పని చేయాల్సి ఉంటుంది

మొత్తం పోస్టుల సంఖ్య: 879 

వివరాలు:

ఆక్యుపేషనల్ థెరపిస్ట్: 125 

ఫిజియోథెరపిస్ట్: 125 

సైకాలజిస్ట్ (Psychologist): 125

స్పీచ్ థెరపిస్ట్ : 125

క్లినికల్ సైకాలజిస్ట్: 125

స్పెషల్ ఎడ్యుకేటర్ - సెకండరీ లెవెల్: 125 

స్పెషల్ ఎడ్యుకేటర్ - ప్రైమరీ లెవెల్: 125

పీఎంయూ కన్సల్టెంట్: 04 పోస్టులు

అర్హత: అభ్యర్థులు ప్రభుత్వం గుర్తించిన సంస్థల నుంచి సంబంధిత వృత్తిపరమైన విద్యార్హతలను కలిగి ఉండాలి. పోస్టులను బట్టి ఆక్యుపేషనల్ థెరపీ, ఫిజియోథెరపీ, లేదా స్పీచ్-లాంగ్వేజ్ పాథాలజీలో బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి; సైకాలజీ/క్లినికల్ సైకాలజీలో ఎంఏ/ఎంఎస్సీ లేదా పీజీ; పీఎంయూ కన్సల్టెంట్ పోస్టుకు పీహెచ్‌డీ/ఎంఫిల్‌, స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టుల కోసం ప్రత్యేక విద్యలో డిప్లొమా లేదా బీ.ఎడ్ చేసి ఉండాలి. కొన్ని పోస్టులకు ఆర్‌సీఐ రిజిస్ట్రేషన్ లేదా ఏపీ టెట్‌/సీటెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి. అన్ని పోస్టులకు సంబంధిత రంగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.

వేతనం: నెలకు స్పెషల్‌ ఎడ్యుకేటర్‌కు రూ.25,000; పీఎంయూ కన్సల్టెంట్‌కు రూ.55,000; ఇతర పోస్టులకు రూ.30,000.

గరిష్ఠ వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, షార్ట్‌లిస్ట్‌, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 04.06.2026.

Website: https://www.edcilindia.co.in/TCareers

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram