దేశ రక్షణ శాఖలో పోస్టుల భర్తీకి యూపీఎస్సీ ఏటా రెండుసార్లు నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ) పరీక్షలు నిర్వహిస్తోంది. 2026 సంవత్సరానికి (నోటిఫికేషన్ నం. 10/2026-NDA-II) రెండో విడత నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా త్రివిధ దళాల విభాగాల్లో 1 జులై 2027 నుంచి ప్రారంభమయ్యే 158వ కోర్సులో, 120వ ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏసీ) కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు. కోర్సు విజయవంతంగా పూర్తి చేస్తే ఉద్యోగాలు ఇస్తారు.
మొత్తం పోస్టుల సంఖ్య: 394
వివరాలు:
యూపీఎస్సీ- నేషనల్ డిఫెన్స్ అకాడమీ & నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ (2)-2026
1. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA): 370 పోస్టులు
ఆర్మీ వింగ్: 208 (198 పురుషులు, మహిళలు-10)
నేవీ వింగ్: 42 (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) (37 పురుషులు, మహిళలకు 05)
ఎయిర్ ఫోర్స్ వింగ్: 120
ఫ్లయింగ్ బ్రాంచ్: 92 (మహిళలకు 02 సహా)
గ్రౌండ్ డ్యూటీలు (టెక్): 18 (మహిళలకు 02 సహా)
గ్రౌండ్ డ్యూటీలు (నాన్-టెక్): 10 (మహిళలకు 02 సహా)
2. నావల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్): 24 పోస్టులు (మహిళలకు 03 సహా)
అర్హత: ఆర్మీ వింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా గ్రూపులో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్ ఫోర్స్, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నేవల్ అకాడమీ) ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారూ అర్హులే.
వయోపరిమితి: అభ్యర్థులు 1 జనవరి, 2008కి ముందు, 1 జనవరి, 2011కి తర్వాత పుట్టి ఉండకూడదు.
ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. రాత పరీక్ష, ఇంటెలిజెన్స్- పర్సనాలిటీ టెస్ట్, ఎస్‌ఎస్‌బీ టెస్ట్/ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టు తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. రాత పరీక్ష(ఆబ్జెక్టివ్)లో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం 900 మార్కులకు నిర్వహిస్తారు. పేవర్-1 మ్యాథమేటిక్స్- 300 మార్కులు (సమయం రెండున్నర గంటలు), పేపర్-2 జనరల్ ఎబిలిటీ- 600 మార్కులుంటాయి(సమయం రెండున్నర గంటలు). రుణాత్మక మార్కులుంటాయి. రాత పరీక్షలో అర్హత పొందిన వారికి సర్వీస్ సెలక్షన్ బోర్డు(ఎస్ఎస్‌బీ) ఆధ్వర్యంలో యూపీఎస్సీ ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్టులు నిర్వహిస్తుంది. ఈ విభాగానికీ 900 మార్కులు కేటాయించారు. ఇందులో ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ రేటింగ్, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్ర్కిప్షన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్ తదితర టాస్కులు నిర్వహిస్తారు. రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ నిర్వహించిన ఇంటర్వ్యూలో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపికలు జరుగుతాయి.
కోర్సులు: నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ), ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ, నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ పరీక్షలో మెరిట్ సాధిస్తే డిగ్రీ కోర్సులకు ఎంపికవుతారు. అలా ఎంపికైనవారు బీఏ, బీఎస్సీ, బీటెక్ కోర్సుల్లో తాము ఎంచుకున్న దాన్ని ఉచితంగా చదవచ్చు.
శిక్షణ: తుది అర్హత సాధించిన అభ్యర్థులు నేషనల్ డిఫెన్స్ అకాడమీ, పుణెలో చదువు, శిక్షణ పొందుతారు. అనంతరం ఆర్మీ క్యాడెట్లను దేహ్రాదూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీకి; నేవల్ క్యాడెట్లను ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీకి; ఎయిర్ ఫోర్స్ క్యాడెట్లను హైదరాబాద్‌లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధిత ట్రేడ్ శిక్షణ కోసం పంపుతారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులో ప్రారంభ స్థాయి ఆఫీసర్ ఉద్యోగాలైన లెఫ్టినెంట్, సబ్-లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్/ గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాతో కెరియర్ ప్రారంభం అవుతుంది.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను upsconline.nic.in/login లో ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుం: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హనుమకొండ (వరంగల్ అర్బన్).
ముఖ్య తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 20-05-2026.
దరఖాస్తుకు చివరి తేదీ: 09-06-2026.
పరీక్ష తేదీ: 13-09-2026.
కోర్సు ప్రారంభం: 01-07-2027.
Website:https://upsconline.nic.in/
Link copied to clipboard!
విజయనగరం జీటీజీహెచ్‌లో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఉద్యోగాలు
ఏపీ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు
రైల్‌టెల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు
ఎన్ఐటీ సిల్చర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
ఎడ్సిల్ లిమిటెడ్‌లో మల్టీ-డిసిప్లినరీ స్టాఫ్ పోస్టులు
యూపీఎస్సీ- నేషనల్ డిఫెన్స్ అకాడమీ
యూపీఎస్సీ సీడీఎస్ఈ-II 2026 నోటిఫికేషన్
బామర్ లారీలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు
సీఎస్ఐఆర్-సింఫర్లో టెక్నీషియన్ ఉద్యోగాలు
బెల్లో ఇంజినీరింగ్ పోస్టులు
దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ప్రవేశాలు 2026
ఏపీలో ఐటీఐ కోర్సుల్లో అడ్మిషన్లు-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో పోస్ట్ డిప్లొమా కోర్సులు
ఐకార్ ఏఐసీఈ- జేఆర్ఎఫ్/ ఎస్ఆర్ఎఫ్ (పీహెచ్డీ)-2026
ఐకార్- ఏఐఈఈఏ (పీజీ)-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో లేటరల్ ఎంట్రీ డిప్లొమా కోర్సులు
ఐఐఎం ముంబయిలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రవేశాలు
ట్రిపుల్ఐటీ-ఏపీలో పీయూసీ, బీటెక్ ప్రోగ్రామ్
సంప్రదాయ కలంకారీ కళలో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు
ఐఐఎస్‌ఎస్‌టీలో పీహెచ్డీ పోగ్రామ్
డీఆర్డీఓ ఎన్ఎంఆర్ఎల్లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ- సీఏఐఆర్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ డీజీ (ఏరోనాటికల్ సిస్టమ్)లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీఓ-ఆర్ అండ్ డీఈలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డీఆర్డీవో- సీఎఫ్‌ఈఈఎస్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
డీఆర్డీఓ - టీబీఆర్ఎల్‌లో పెయిడ్ ఇంటర్న్‌షిప్ పోస్టులు
స్విమ్స్ తిరుపతిలో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
ఈఎస్ఐసీ ఫరీదాబాద్‌లో టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఈఎస్ఐసీ వారణాసిలో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు
ఈఎస్ఐసీ కోల్‌కతాలో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు
ఎస్ఎస్బీలో ఉద్యోగాలు
కొంకణ్ రైల్వేలో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
ఈఎస్ఐసీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
సీఎల్ఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్, జేఆర్ఎఫ్ పోస్టులు
టీఎంసీ వారణాసిలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులు
హైదరాబాద్ మిధానిలో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు
ఎస్బీఐలో అప్రెంటిస్ పోస్టులు
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, నాగ్‌పుర్‌లో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ జీటీఆర్ఈలో ఇంజినీరింగ్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో పోస్టులు
హెచ్ఏఎల్ హైదరాబాద్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎన్ఎండీసీలో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు