బామర్‌ లారీలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు

బామర్‌ లారీలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు

భారత ప్రభుత్వరంగ సంస్థకు చెందిన పెట్రోలియం అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ మంత్రిత్వ శాఖ పరిధిలోని మినీరత్న-I పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్ అయిన కోల్‌కతాలోని బామర్‌ లారీ అండ్‌ కో లిమిటెడ్‌.. సంబంధిత విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్ల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 62

వివరాలు:

1. గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ పోస్టులు:

ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (మెకానికల్): 9 పోస్టులు

ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (కెమికల్): 6 పోస్టులు

ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఫుడ్ టెక్నాలజీ): 1 పోస్టు

ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఐటీ): 6 పోస్టులు

ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (లెదర్ టెక్నాలజీ): 1 పోస్టు

మొత్తం ఇంజినీరింగ్ పోస్టులు: 23

2. ఎంబీఏ/తత్సమాన మేనేజ్‌మెంట్ పోస్టులు: 

ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (సేల్స్ & మార్కెటింగ్): 16 పోస్టులు

ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఆపరేషన్స్): 11 పోస్టులు

ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఐటీ మేనేజ్‌మెంట్): 2 పోస్టులు

ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (సప్లై చైన్ మేనేజ్‌మెంట్ - SCM): 5 పోస్టులు

ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (హెచ్ఆర్): 1 పోస్టు

ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (లాజిస్టిక్స్ / ట్రాన్స్‌పోర్టేషన్): 3 పోస్టులు

ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఐటీ - ఫైనాన్స్): 1 పోస్టు

మొత్తం మేనేజ్‌మెంట్ పోస్టులు: 39

అర్హత: అభ్యర్థులు సంబంధిత విభాగాలలో బీఈ/బీటెక్‌ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా / పీజీ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

పే స్కేల్: నెలకు రూ.40,000 - రూ.1,40,000.

వయోపరిమితి: ఇంజినీరింగ్ పోస్టులకు 25 ఏళ్లు, మేనేజ్‌మెంట్ పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, గ్రూప్‌ డిస్కషన్‌ తదితరాల ఆధారంగా. 

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్‌, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 09.06.2026.

Website:https://www.balmerlawrie.com/hi/careers/current-openings

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram