భారత్ అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కలిగిన గణతంత్ర రాజ్యం. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపమే మన రాజ్యాంగం. పౌరులు, పాలకులు, పాలనా యంత్రాంగం పాటించాల్సిన అత్యున్నత చట్టంగా దీన్ని పేర్కొంటారు. ఇందులో ప్రభుత్వ విభాగాలు - వాటి స్వరూపం, స్వభావం, లక్ష్యాలు, ఆశయాలను వివరించారు. వ్యక్తి స్వేచ్ఛకు, సర్వతోముఖాభివృద్ధికి రాజ్యాంగం హామీ ఇస్తుంది. భారతదేశ ప్రజాస్వామ్య, లౌకిక, సమానత్వ భావనలను సూచించే ప్రాథమిక పత్రంలా ఇది పనిచేస్తుంది. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీకి గుర్తుగా ఏటా నవంబరు 26న ‘జాతీయ రాజ్యాంగ దినోత్సవం’గా (National Constitution Day) నిర్వహిస్తారు. దీన్నే ‘సంవిధాన్ దివస్’ అనే పేరుతోనూ పిలుస్తారు. రాజ్యాంగ రచనలో పాలుపంచుకున్నవారిని గౌరవించడం, రాజ్యాంగ సూత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
గమనిక: రాజ్యాంగ సభలో ముఖ్య పాత్ర పోషించిన 15 మంది స్త్రీల గురించిన సమాచారం జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ కాంబో కోర్సులో ‘రాజ్యాంగ నిర్మాణంలో మహిళలు’ పేరుతో ఈ-బుక్ రూపంలో అందుబాటులో ఉంది.
చారిత్రక నేపథ్యం
మన రాజ్యాంగానికి 1949, నవంబరు 26న ఆమోదం లభించింది. దీంతో ఆ తేదీని ‘జాతీయ రాజ్యాంగ దినోత్సవం’గా జరుపుకోవాలని ప్రభుత్వం భావించింది. 2015 భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి సంవత్సరం. ఈ ఉత్సవాలను ఘనంగా జరపాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ఏడాది నుంచి నవంబరు 26ను రాజ్యాంగ దినోత్సవంగా కూడా ప్రకటించింది. అప్పటి నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.
| రాజ్యాంగ రచనలో పాలుపంచుకున్న వివిధ కమిటీలు - అధ్యక్షులు, భారత రాజ్యాంగంలో వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలు తదితర సమాచారంతోపాటు గతంలో తెలంగాణ పోలీస్ ఎస్ఐ మెయిన్స్, ఎస్ఎస్సీ సీజీఎల్, ఎంటీఎస్, ఆర్ఆర్బీ తదితర పోటీపరీక్షల్లో ఈ టాపిక్ నుంచి అడిగిన 150కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కాంబో కోర్సు’కి సబ్స్క్రైబ్ చేసుకోండి! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
(బీపీఎస్సీ, 2016), (ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్, 2020),
(కేరళ ఎస్ఈటీ పేపర్ 1, 2018), (ఎన్టీపీసీ, 2020),
(ఎంపీ ఎక్సైజ్ కానిస్టేబుల్, 2025), (ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్, 2017),
(ఆర్ఆర్సీ గ్రూప్ డి, 2018), (కలకత్తా హైకోర్ట్ (ఎల్డీఏ), 2019),
(ఐకార్ టెక్నీషియన్, 2022), (ఏపీఎస్ఎస్బీ ఫారెస్టర్, 2022),
(ఎస్ఎస్సీ ఎంటీఎస్, 2020), (ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, 2021),
(ఎస్ఎస్సీ సీజీఎల్ టైర్ 1, 2024), (ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్, 2021),
(ఎస్ఎస్సీ ఎంటీఎస్, 2021)
1) అక్టోబరు 26 2) నవంబరు 26
3) జులై 26 4) జనవరి 26
సమాధానం: 2
2. భారత రాజ్యాంగం కింది దేనితో ప్రారంభమవుతుంది?
(యూపీఎస్ఎస్ఎస్సీ పీఈటీ, 2025)
1) ఆదేశ సూత్రాలు 2) పౌరసత్వం
3) ప్రాథమిక హక్కులు 4) ప్రవేశిక
5) పైవేవీ కాదు
సమాధానం: 4
3. నవంబరు 26ని రాజ్యాంగ దినోత్సవంగా అధికారికంగా ఎప్పుడు ప్రకటించారు?
(ఎస్ఎస్సీ గ్రాడ్యుయేట్ లెవల్, 2022)
1) 2015, నవంబరు 19 2) 1919, నవంబరు 19
3) 1919, నవంబరు 26 4) 2015, అక్టోబరు 31
సమాధానం: 1
4. భారత రాజ్యాంగం ఏ తేదీన అమల్లోకి వచ్చింది?
(దిల్లీ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్), 2025)
1) 1947, ఆగస్టు 15 2) 1950, జనవరి 26
3) 1949, నవంబరు 26 4) 1950, జనవరి 30
సమాధానం: 2
5. Which Article of the Indian Constitution empowers the Parliament to establish additional courts for better administration of laws made by it?
(SSC CGL Tier-I, 2023)
1) Article 246 2) Article 248 3) Article 253 4) Article 247
Ans: 4
6. The schedule which deals with anti-defection provisions is :
(SSC Selection Posts (Matriculation Level) 2026)
1) Eighth Schedule 2) Ninth Schedule
3) Tenth Schedule 4) Twelfth Schedule
Ans: 3
7. Elements of the basic structure of the Indian Constitution as enunciated by the Supreme Court include:
i. Free and fair elections
ii. Secularism
iii. Federalism
iv. Supremacy of the fundamental rights over directive principles of state policy
Choose the correct answer:
(TSPSC VRO, 2018)
1) i, ii & iv only 2) ii, iii & iv only
3) i, iii & iv only 4) i, ii & iii only
Ans: 4
8. Consider the following statements:
I. The Preamble was enacted before the enactment of the entire Constitution.
II. The Preamble is a part of the Constitution but has no legal effect independently of other parts.
III. It is enforceble through Courts of Law.
IV. The Objectives Resolution by Jawaharlal Nehru finally became the foundation for the Preamble.
Which of the statements given above are incorrect?
(APPSC Group 1 Prelims (GA), Paper-I, 2023)
1) I and II only 2) II and IV only
3) I and III only 4) I, II and III only
Ans: 3