అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం

అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం

ఆహారం, ఇల్లు, దుస్తులు, ఆరోగ్యం, విద్య లాంటి కనీస జీవన అవసరాలను సమకూర్చుకోలేని స్థితినే పేదరికం అంటారు. ఈ స్థితిలో ఉండి, కనీస స్థాయి జీవనాధార ఆదాయం లేనివారిని పేదలుగా పేర్కొంటారు. ఇదొక సాంఘిక, ఆర్థిక లక్షణం. ఉపాధి లేమి, అధిక జనాభా పేదరికానికి ప్రధాన కారణాలు. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని సమస్యలకు మూలకారణమై, అనేక ప్రభావాలకు దారితీస్తుంది. దారిద్య్రం వల్ల కలిగే సమస్యలపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా అక్టోబరు 17న ‘అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం’గా (International Day For The Eradication Of Poverty) నిర్వహిస్తారు. దీని కారణంగా ప్రభావితమైన వారికి సహాయ సహకారాలు అందించడంతోపాటు పేదరికాన్ని రూపుమాపడానికి చేపట్టిన చర్యలపై విస్తృత ప్రచారం కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

  • ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ పేదరికాన్ని అంచనా వేయడానికి ప్రపంచ బ్యాంక్‌ 1990లో ‘రోజుకు ఒక డాలర్‌’ అనే అంతర్జాతీయ పేదరిక రేఖను ప్రవేశపెట్టింది. అంటే సగటున రోజుకు ఒక డాలర్‌ కంటే తక్కువ సంపాదించేవారు ఈ కోవలోకి వస్తారు. 2015లో ప్రపంచ బ్యాంక్‌ దీన్ని రోజుకు 1.90 డాలర్లుగా మార్చింది. ప్రపంచవ్యాప్తంగా 280 కోట్లమందికి పైగా ప్రజలకు సొంత ఇళ్లు లేవు. 

ఐక్యరాజ్య సమితి గణాంకాలు - చర్యలు

  • 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం జనాభాలో సుమారు 82.6 కోట్లమంది ప్రజలు (10%) తీవ్ర పేదరికంలో జీవిస్తున్నారు. 2021 నాటి కొనుగోలు శక్తి సమానత్వం (purchasing power parity) ప్రకారం వారు రోజుకు 3 డాలర్ల కంటే తక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు. ప్రపంచంలోని దాదాపు సగం మంది రోజుకు 6.85 డాలర్ల కంటే తక్కువ పొందుతున్నట్లు అంచనా. 
  • తీవ్ర పేదరికం నుంచి ప్రజలకు విముక్తి కల్పించే లక్ష్యంతో 2000, సెప్టెంబరులో ఐరాస సాధారణ సభ మిలీనియం డిక్లరేషన్‌కు ఆమోదం తెలిపింది. 2015 నాటికి 8 సహస్రాబ్ది లక్ష్యాలను సాధించాలని నిర్దేశించాయి. అందులో మొదటిది ‘పేదరికం, ఆకలి నిర్మూలన’. 1990 నాటికి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న జనాభా శాతాన్ని 2015 నాటికి సగానికి తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఇది నెరవేరింది.
  • భారతదేశం పేదరికాన్ని తగ్గించడంలో విజయవంతమైంది. 1990లో దేశంలో పేదరికం 47.8% ఉంది. ఇది 2015 నాటికి 23.9% కావాలి. అయితే 2011-12 నాటికే దేశ పేదరికం 21.9 శాతానికి తగ్గింది. ఐక్యరాజ్యసమితి 2015-30 కాలానికి నిర్దేశించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మొదటిది ‘పేదరికాన్ని నిర్మూలించడం’. ఇందులో 2030 నాటికి పేదరికాన్ని సగానికి తగ్గించాలి.  

2011 జనాభా లెక్కల ప్రకారం..

భారత్‌లో పేదరికం: 21.9%. అత్యల్ప పేదరికం ఉన్న రాష్ట్రాలు: కేరళ- 7.1%, హిమాచల్‌ప్రదేశ్‌ - 8.1%, పంజాబ్‌ - 8.3%, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ - 9.2%. పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు: బిహార్‌ - 33.7%, ఒడిశా - 32.6%, అస్సాం - 31.9%. భారత్‌లో పేదల శాతం క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. 2005లో పేదల సంఖ్య 510.4 మిలియన్ల నుంచి 2013 నాటికి 274.5 మిలియన్లకు తగ్గింది. 

ఏ పోటీపరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థికైనా గతంలో ఎలాంటి అంశాల మీద ఏ తరహా ప్రశ్నలు అడిగారో అవగాహన అవసరం. 2024లో ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమినరీ, 2025, 2026లో ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీపరీక్షల్లో ఈ టాపిక్‌పై అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ మీ కోసం..! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. పేదరికం అంటే?

(ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్, 2025)

1) అధిక జనాభా కలిగి ఉండటం

2) ఆహారం, దుస్తులు, నివాసం లాంటి కనీస అవసరాలను తీర్చుకోలేకపోవడం

3) విద్య లేకపోవడం

4) ఉపాధి అవకాశాలు లేకపోవడం

సమాధానం: 2

2. సాపేక్ష పేదరికం దేన్ని సూచిస్తుంది?

(45వ బీపీఎస్సీ ప్రిలిమ్స్, 2002)

1) దివాలా                    2) వ్యాపార చక్రాలు

3) జీవిత కనీస అవసరాలు        4) ఆర్థిక అసమానతలు

సమాధానం: 4

3. అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?

(ఎంపీ హెచ్‌ఎస్‌టెట్‌ (గణితం), 2019), (ఏపీపీఎస్సీ పంచాయతీ సెక్రటరీ, 2018),

(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ టైర్‌ 1, 2025), (ఎంపీ పట్వారీ, 2017)

1) అక్టోబరు 15           2) అక్టోబరు 21

3) అక్టోబరు 17           4) అక్టోబరు 18

సమాధానం: 3

4. భారతదేశంలో పేదరికానికి కారణం కానిది ఏది?

(ఆర్‌ఈఈటీ లెవల్‌ 2 (సాంఘికశాస్త్రం), 2011)

1) నిరుద్యోగం            2) వేగవంతమైన జనాభా పెరుగుదల

3) విద్య                4) పెద్ద కుటుంబ పరిమాణం

సమాధానం: 3

5. What was the revised International Poverty Line (IPL) set by the World Bank for India in June 2025?
(RRB Group D, 2025)
1) $3.50/day            2) $3.00/day            3) $2.50/day            4) $2.15/day
Ans: 2
6. Which type of poverty is generally considered as a result of insufficient income?
(RPF Constable, 2025)
1) Situational poverty    2) Absolute poverty
3) Relative poverty    4) Urban poverty
Ans: 2
7. Consider the following Committees relating to poverty and arrange their formation in correct chronological order.
i. Lakdawala Committee
ii. Rangarajan Committee
iii. Tendulkar Committee
iv. Dandekar and Rath Committee
Select the correct answer from the code given below :
Code:
(UPPSC PCS Prelims, GS Paper-I, 2025)
1) iv, i, iii, ii        2) i, iv, ii, iii        3) i, iv, iii, ii        4) iv, i, ii, iii
Ans: 1
8. As per Planning Commission of India, in 2004–05, the percentage of total population of India below poverty line (Lakadawala Poverty Estimates combined) was:
(SSC MTS, 2024)
1) 38.86%        2) 27.5%        3) 44.48%        4) 35.97%
Ans: 2
9. The Expert Group under the Chairmanship of Dr. C. Rangarajan to Review the Methodology for Measurement of Poverty in the country was constituted by the Planning Commission in___________.
(SSC CHSL Tier-1, 2025)
1) 2012        2) 2010        3) 2008        4) 2006
Ans: 1
10. How did the Rangarajan Group recommend updating the poverty line in the future?
(RRB NTPC (UG) CBT-I, 2026)
1) By using the Fisher Index with data from NSSO
2) By removing the concept of poverty line altogether
3) By relying on the National Accounts Statistics
4) By using a relative poverty measure compared to an absolute measure
Ans: 1

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram