ప్రపంచ ఆహార దినోత్సవం

ప్రపంచ ఆహార దినోత్సవం

ఆహారం అనేది మనిషి కనీస అవసరం. ఇది కణజాలాల పెరుగుదల, మరమ్మతు, జీవక్రియ నియంత్రణ, మనుగడ కోసం అవసరమైన పోషకాలు, శక్తిని అందిస్తుంది. మానవ ఆరోగ్యానికి, మెరుగైన భవిష్యత్తుకు పౌష్ఠికాహారం అవసరం. ఇది లోపిస్తే పిల్లలు, యువకులు తమ సామర్థ్యాన్ని పూర్తిగా అభివృద్ధి చేసుకోలేరు; అలాగే పెద్దలు తమ ఉత్తమ పనితీరును కనబరచడంలో ఇబ్బంది పడతారు. ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ) ఏర్పాటుకు గుర్తుగా ఏటా అక్టోబరు 16న ‘ప్రపంచ ఆహార దినోత్సవం’గా (World Food Day) నిర్వహిస్తారు. ఆకలి గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చించడం; దాని నిర్మూలన - స్థిరమైన ఆహార వ్యవస్థలను నిర్మించే చర్యలను ప్రోత్సహించడం ఈ దినోత్సవం లక్ష్యం. ఆహార భద్రత, పోషకాహార ప్రాముఖ్యత గురించి ప్రజలను చైతన్యపరచడంతోపాటు ఆహార వృథాను అరికట్టడంపై అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

  • ప్రస్తుతం ప్రపంచ జనాభా సుమారు 800 కోట్లు కాగా, అందులో అనేకమంది ప్రజలు నిత్యం ఆకలితో అలమటిస్తున్నట్లు వివిధ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ‘ది స్టేట్‌ ఆఫ్‌ ఫుడ్‌ సెక్యూరిటీ అండ్‌ న్యూట్రిషన్‌ ఇన్‌ ది వరల్డ్‌ (ఎస్‌ఓఎఫ్‌ఐ)-2026’ నివేదిక ప్రకారం, 2025లో ప్రపంచ జనాభాలో 64.5 కోట్ల మంది (7.8%) ఆకలి సమస్యను ఎదుర్కొన్నారు. ఇది 2022లో 8.6%, 2024లో 8.1 శాతంగా ఉంది. 

ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ)

  • ఇది ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ సంస్థ. ఆకలిని నిర్మూలించడం, పోషకాహార లభ్యతను పెంచడం, ప్రపంచవ్యాప్తంగా సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం దీని ముఖ్య లక్ష్యాలు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తలెత్తిన తీవ్రమైన ఆహార కొరత, కరవు సమస్యలను పరిష్కరించేందుకు 1945లో కెనడాలోని క్యూబెక్‌ నగరంలో ఈ సంస్థను ఏర్పాటు చేశారు.
  • ఎఫ్‌ఏఓ ప్రధాన కార్యాలయం ఇటలీలోని రోమ్‌లో ఉంది. ప్రస్తుతం ఇందులో 195 సభ్యదేశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికీ తగినంత, ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో ఉండేలా చేసే ప్రపంచ ప్రయత్నాలకు మూలస్తంభంగా ఉంది. 2026, అక్టోబరు 16 నాటికి దీనికి డైరెక్టర్‌ జనరల్‌గా క్వూ డోంగ్యూ (QU Dongyu) ఉన్నారు. ఈయన చైనాకు చెందినవారు. 
  • మన దేశంలో ఎఫ్‌ఏఓ 1948లో కార్యకలాపాలు ప్రారంభించింది. దీని కార్యాలయం దిల్లీలో ఉంది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మర్స్‌ వెల్ఫేర్‌ మన దేశంలో ఎఫ్‌ఏఓకు నోడల్‌ ఏజెన్సీగా ఉంది. 2016ను అంతర్జాతీయ పప్పుధాన్యాల సంవత్సరంగా; 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరపాలనే భారతదేశ ప్రతిపాదనలను ఎఫ్‌ఏఓ ఆమోదించింది. 

చారిత్రక నేపథ్యం

ప్రపంచవ్యాప్తంగా ఆకలిని రూపుమాపి, అందరికీ పౌష్ఠికాహారంతోపాటు ఆహార భద్రతను కల్పించే లక్ష్యంతో 1945, అక్టోబరు 16న ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ) ఏర్పడింది. ఇది ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ. 1979, నవంబరులో రోమ్‌ (ఇటలీ)లో ఎఫ్‌ఏఓ 20వ సర్వసభ్య సమావేశం జరిగింది. అందులో దీని వ్యవస్థాపక దినోత్సవమైన అక్టోబరు 16న ఏటా ‘ప్రపంచ ఆహార దినోత్సవం’గా జరుపుకోవాలని సభ్య దేశాలు తీర్మానించాయి. 

పోటీపరీక్షలకు జనరల్‌ నాలెడ్జ్‌ విభాగం నుంచి అడిగే ప్రశ్నల తీరును అర్థం చేసుకోవడం అభ్యర్థులకు చాలా కీలకం. ఈ టాపిక్‌పై 2024లో జరిగిన టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ -1 ప్రిలిమినరీ, 2025, 2026లో ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌-డితోపాటు ఎస్‌ఎస్‌సీ తదితర పోటీపరీక్షల్లో అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ మీ కోసం..! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ఆహారానికి సంబంధించి కిందివాటిలో సరికానిది?

(ఎన్‌టీపీసీ సీబీటీ 2, 2017)

1) ఇది ఒక అకర్బన పదార్థం

2) ఇది రసాయన చర్యలకు లోనవుతుంది

3) ఇది ఒక కర్బన పదార్థం

4) ఇది శక్తిని అందిస్తుంది

సమాధానం: 1

2. ఆహారం విధులు?

(ఎంపీ మహిళా సూపర్‌వైజర్, 2017)

1) జీవన నిర్వహణ, రక్షణ

2) పెరుగుదల, అభివృద్ధి

3) ముఖ్యమైన అవయవాల పనితీరు, శక్తి ఉత్పత్తి

4) పైవన్నీ

సమాధానం: 4

3. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?

(అలహాబాద్‌ హైకోర్టు ఆర్‌ఓ, 2021), (ఎంపీ పోలీస్‌ ఎస్‌ఐ, 2016), 

(యూపీ పోలీస్‌ అసిస్టెంట్‌ ఆపరేటర్, 2024),

1) జూన్‌ 5                    2) డిసెంబరు 24

3) అక్టోబరు 16                 4) ఏప్రిల్‌ 21

సమాధానం: 3

4. ఏ రకమైన ఆహారాన్ని రక్షక ఆహారం (protective food)గా వర్గీకరిస్తారు?

(ఎంపీ ఫారెస్ట్‌ గార్డ్‌/ జైల్‌ ప్రహారీ 2023)

1) పిండిపదార్థాలు, కొవ్వులు            2) ప్రోటీన్‌

3) విటమిన్‌                        4) లిపిడ్, ప్రోటీన్‌

సమాధానం: 3

5. Which of the following is/are NOT a dimension of food security?
i. Availability
ii. Accessibility
iii. Affordability
iv. Accountability
Select the correct answer from the code given below:
(UPPSC PCS Prelims, GS Paper-I, 2025)
1) Only i        2) ii, iii and iv        3) Only iv        4) i and ii
Ans: 3
6. Foods like pizza, burger are rich in:
(SSC Selection Post (Matriculation Level), 2024)
1) proteins        2) Vitamins            3) carbohydrates         4) Minerals
Ans: 3
7. Which of the following foods is called a ‘body-building’ food?
(RRB Group D, 2022)
1) Food rich in carbohydrates, like wheat
2) Food rich in proteins, like peas
3) Food rich in fats, like butter
4) Food rich in vitamins, like apples
Ans: 2
8. Which of the following is not one of the five basic food groups suggested by the Indian Council of Medical Research?
(SSC GD Constable, 2023)
1) Milk and meat products    2) Carbohydrates and Proteins
3) Pulses and legumes        4) Fats and sugars
Ans: 2
9. Food rich in carbohydrates (like potatoes) and those rich in fats (like butter) are also known as __________. 
(SSC JE Mechanical, 2024)
1) Energy - Giving Food        2) Main Course
3) Unsafe Food            4) Fast Food
Ans: 1
10. Some organisms take in whole food material and break it down inside their bodies. This is called ________ nutrition.
(RRB Group D, 2026)
1) saprophytic        2) holozoic        3) parasitic        4) autotrophic
Ans: 2

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram