ప్రపంచ ప్రమాణాల దినోత్సవం

ప్రపంచ ప్రమాణాల దినోత్సవం

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో, ఆరోగ్యకర జీవనంలో ‘ప్రమాణాలు’ కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండి, కచ్చితమైన నిర్వచనాన్ని ఇస్తాయి. మనం కొనుగోలు చేసే లేదా వినియోగించే ఏ వస్తువుకైనా నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి. ఉత్పత్తులు, సేవలు, వ్యవస్థలు మొదలైనవి సురక్షితంగా, విశ్వసనీయంగా, పరస్పర అవగాహనతో ముందుకు సాగాలంటే ప్రామాణికీకరణ అవసరం. వీటి ఆవశ్యకతను ప్రపంచానికి తెలిపే లక్ష్యంతో ఏటా అక్టోబరు 14న ‘ప్రపంచ ప్రమాణాల దినోత్సవం’గా (World Standards Day) నిర్వహిస్తారు. వివిధ పరిశ్రమల్లో ప్రామాణికీకరణను ప్రోత్సహించడంతోపాటు మెరుగైన ఉత్పత్తులు, వ్యవస్థల అభివృద్ధిలో వీటిని పాటించాల్సిన ఆవశ్యకతను చాటిచెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

ప్రమాణాలు అంటే?

ప్రత్యక్ష పోలిక కోసం ఉపయోగించే ఒక అధికారిక నియమం, నమూనా లేదా స్థిర కొలతను ప్రమాణంగా పేర్కొంటారు. ఉదాహరణకు ఒక కొలత ఎవరు కొలిచినా, ఏ ప్రదేశంలో కొలిచినా ఒకే విలువను ఇస్తే దాన్ని ‘ప్రామాణిక కొలత’ అంటారు. సింధూ నాగరికత ప్రజలు చాలా ప్రామాణికమైన, కచ్చితమైన కొలతను ఉపయోగించారు. ప్రాచీన ఈజిప్షియన్లు మూరను ఒక యూనిట్‌గా భావించారు. 1790లో ఫ్రెంచ్‌ దేశస్థులు మెట్రిక్‌ వ్యవస్థ అనే ప్రామాణిక కొలత పద్ధతిని రూపొందించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందింది.

భారతదేశంలో ప్రమాణాలు

  • మన దేశంలో ప్రమాణాలను ప్రధానంగా బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్స్‌ (బీఐఎస్‌) రూపొందిస్తుంది, నియంత్రిస్తుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్‌ కన్‌స్యూమర్‌ అఫైర్స్, ఫుడ్‌ అండ్‌ పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆధ్వర్యంలో పనిచేసే భారత జాతీయ ప్రమాణాల సంస్థ. మొదట్లో దీన్ని ఇండియన్‌ స్టాండర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ) అని పిలిచేవారు. దీన్ని 1947, జనవరి 6న ఏర్పాటు చేశారు. పారిశ్రామిక వస్తువుల ధ్రువీకరణ చిహ్నమైన ‘ఐఎస్‌ఐ మార్క్‌’ను ఇదే అందించేది.  
  • బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ 1986 ప్రకారం, ఐఎస్‌ఐ స్థానంలో 1987, ఏప్రిల్‌ 1న అధికారికంగా బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) ఉనికిలోకి వచ్చింది. ఇది ఒక స్వయంప్రతిపత్తి సంస్థ. భారతదేశంలోని వివిధ ఉత్పత్తులు, సేవల కోసం జాతీయ ప్రమాణాలను నిర్దేశించడం, వాటిని ప్రోత్సహించడం దీని బాధ్యత. భారతదేశంలో విక్రయించే కొన్ని ఉత్పత్తులకు తప్పనిసరి అయిన నాణ్యత హామీ ధ్రువీకరణే బీఐఎస్‌ సర్టిఫికేషన్‌. 

బీఐఎస్‌ అనేది ఐఎస్‌ (ఇండియన్‌ స్టాండర్డ్‌) కోడ్‌తో ప్రమాణాలు అందిస్తుంది. 

వాటిలో ముఖ్యమైనవి: 

  • ఐఎస్‌ 15000 సిరీస్‌: ఆహార భద్రతా నిర్వహణ వ్యవస్థలు.
  • ఐఎస్‌ 16000 సిరీస్‌: పర్యావరణ నిర్వహణ వ్యవస్థలు
  • ఐఎస్‌ 18000 సిరీస్‌: వృత్తిపరమైన ఆరోగ్యం, భద్రతా నిర్వహణ వ్యవస్థలు
  • ఐఎస్‌ 40000 సిరీస్‌: శక్తి నిర్వహణ వ్యవస్థలు

కొన్ని ముఖ్యమైన అంతర్జాతీయ ప్రమాణాల కోడ్‌లు 

1. ఐఎస్‌ఓ 9000: సంస్థలు తయారు చేసే ఉత్పత్తులు, అందించే సేవల నాణ్యతకు సంబంధించిన ప్రమాణాలను అందిస్తుంది.

2. ఐఎస్‌ఓ/ ఐఈసీ 27000: ఐటీ - సైబర్‌ భద్రత, గోప్యత రక్షణ లాంటి భద్రత నిర్వహణకు 

3. ఐడబ్ల్యూఏ 42/ నెట్‌ జీరో: నికర సున్నా గ్రీన్‌ హౌస్‌ వాయు ఉద్గారాలను గుర్తించేందుకు మార్గదర్శకాలను సూచిస్తుంది.

చారిత్రక నేపథ్యం

ప్రపంచవ్యాప్తంగా అన్ని అంశాల్లో ఒకే విధమైన ప్రామాణికీకరణను ప్రోత్సహించే లక్ష్యంతో 1946, అక్టోబరు 14న లండన్‌ వేదికగా ఒక సమావేశాన్ని నిర్వహించారు. దీని ఫలితంగానే ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ స్టాండర్డైజేషన్ (ఐఎస్‌ఓ)ను నెలకొల్పారు.  ఈ సమావేశానికి గుర్తుగా ఏటా అక్టోబరు 14న ‘ప్రపంచ ప్రమాణాల దినోత్సవం’గా నిర్వహించాలని ఐఎస్‌ఓ, ఇంటర్నేషనల్‌ ఎలక్ట్రోటెక్నికల్‌ కమిషన్‌ (ఐఈసీ), ఇంటర్నేషనల్‌ టెలీకమ్యూనికేషన్‌ యూనియన్‌ (ఐటీయూ) భావించాయి.  

ప్రమాణాలను రూపొందించే ముఖ్యమైన దేశీయ, అంతర్జాతీయ సంస్థలు, గతంలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1, టీజీపీఎస్సీ ఏఈఈ, ఐబీపీఎస్‌ పీవో మెయిన్స్, ఎల్‌ఐసీ ఏఏఓ మెయిన్స్, ఆర్‌ఆర్‌బీ క్లర్క్‌ మెయిన్స్‌ తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన 150కి పైగా ప్రశ్నలు - - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ మీ కోసం..! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ప్రయోగశాలలు, వర్క్‌షాపుల్లో రిఫరెన్స్‌ ప్రయోజనాల కోసం ఉపయోగించే ప్రమాణాలను ఏమని పిలుస్తారు?

(ఎంసీఎస్సీ ఏఎంవీఐ, 2017)

1) ప్రాథమిక ప్రమాణాలు            2) తృతీయ ప్రమాణాలు

3) ద్వితీయ ప్రమాణాలు             4) పని ప్రమాణాలు

సమాధానం: 2

2. భారతీయ ప్రమాణాల ప్రకారం, మొత్తం టాలరెన్స్‌ గ్రేడ్‌ల సంఖ్య...

(డబ్ల్యూబీపీఎస్సీ జేఈ మెకానికల్, 2018)

1) 8           2) 12           3) 18           4) 20

సమాధానం: 3

3. ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?

(ఏఎఫ్‌సీఏటీ, 2025), (ఎంపీ పోలీస్‌ ఎస్‌ఐ, 2016),

(యూపీ పోలీస్‌ ఏఎస్‌ఐ, 2021), (యూపీ పోలీస్‌ అసిస్టెంట్‌ ఆపరేటర్, 2024),

(ఓఎస్‌ఎస్‌ఎస్సీ జీపీఈఓ, 2015), (పంజాబ్‌ పోలీస్‌ ఎస్‌ఐ, 2016)

1) అక్టోబరు 12               2) అక్టోబరు 13

3) అక్టోబరు 14               4) అక్టోబరు 15

సమాధానం: 3

4. ఇండియన్‌ స్టాండర్డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ)ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?

(మహారాష్ట్ర జిల్లా పరిషత్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ క్లర్క్‌ (నాసిక్‌), 2015)

1) 1942       2) 1945       3) 1947       4) 1949

సమాధానం: 3

5. Bureau of Indian Standards caters to
(UIIC Assistant Memory Based Paper 2024)
1) Industrial and consumer goods
2) Agricultural products
3) Crackers and match – box production
4) Standards of living of the citizens
5) None of the above
Ans:1
6. Bharat Stage (BS) VI standards are related to ______.
(TGPSC AEE Paper-I, 2023)
1) Ramsar Sites in India        2) Wildlife conservation
3) Forest conservation        4) Vehicle Emissions
Ans: 4
7. According to BS standards, what is the Environmental Management Code?
(RRB ALP CBT-II (Machinist), 2025)
1) BS EN ISO 14001            2) BS ISO 45001
3) BS EN ISO/IEC 27001        4) BS EN ISO 9001
Ans: 1
8. IEEE 80 provides recommendations for ________.
(RRB ALP CBT-II (Electrician), 2025)
1) Voltage regulation in power systems
2) Standards for Insulating Materials
3) Proper installation of grounding and bonding systems in electrical installations
4) Measurement of electrical energy consumption
Ans: 3

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram