అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినోత్సవం

అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినోత్సవం

ప్రజాజీవనానికి తీవ్రనష్టం కలిగించి, వనరులను ధ్వంసం చేసి, సాధారణ కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగించేవే విపత్తులు. ఇవి సహజసిద్ధంగా లేదా మానవ చర్యల ఫలితంగా చోటుచేసుకుంటాయి. వరదలు, తుపానులు, భూకంపాలు, కార్చిచ్చులు, సునామీ, కరవు, బాంబు పేలుడు మొదలైనవన్నీ దీని రూపాలే. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా విపత్తులు పెరిగిపోతున్నాయి. వీటివల్ల ప్రాణ, ఆస్తి నష్టంతోపాటు పర్యావరణ సమస్యలూ ఏర్పడుతున్నాయి. విపత్తుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా అక్టోబరు 13న ‘అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినోత్సవం’గా (International Day for Disaster Risk Reduction) నిర్వహిస్తారు. దీన్నే ‘వరల్డ్‌ డిజాస్టర్‌ రిడక్షన్‌ డే’ అనే పేరుతోనూ పిలుస్తారు. అనుకోని దుర్ఘటనలు సంభవించినప్పుడు ఏ విధంగా ప్రతిస్పందించాలి, నష్ట నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై పౌరులను చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

విపత్తు ప్రమాద తగ్గింపు/ విపత్తు నిర్వహణ

  • సమాజంలోని దుర్భలత్వాలను, విపత్తు ప్రమాదాలను తగ్గించడానికి చేపట్టే వివిధ రకాల చర్యలు, వ్యూహాలను విపత్తు ప్రమాద తగ్గింపు లేదా  విపత్తు నిర్వహణ అంటారు.
  • వీటిలో ముందస్తు హెచ్చరిక వ్యవస్థల, దృఢమైన మౌలిక సదుపాయాలు, ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు, విధానపరమైన సంస్కరణలు మొదలైనవి ఉంటాయి.
  • భారీ ప్రాణనష్టం, గాయాలు, ఆస్తినష్టం లేకుండా సహజ, మానవ కారక విపత్తులను తట్టుకోగల సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించడం దీని ప్రధాన లక్ష్యం. 

విపత్తు ప్రమాద తగ్గింపు (Disaster Risk Reduction)లో వివిధ చర్యలు ఉంటాయి. అవి:

1. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు (Early Warning Systems): భూకంప డిటెక్టర్లు, వరద అంచనా వ్యవస్థలను ఏర్పాటు చేయడం. ఇవి ప్రజలకు క్రమం తప్పకుండా వాతావరణ సమాచారాన్ని అందిస్తాయి.

2. పటిష్ఠ మౌలిక సదుపాయాలు (Infrastructure Resilience): భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో భూకంప నిరోధ భవనాలు; వరద ముప్పు ప్రాంతాల్లో ఎత్తయిన పునాదులు ఉన్న ఇళ్లను నిర్మించాలని నిర్దేశించే భవన నిర్మాణ నియమావళిని రూపొందించడం.

3. సమాజ సంసిద్ధతా కార్యక్రమాలు (Community Preparedness Programs): ప్రమాదాల సమయంలో స్థానిక ప్రజలకు అత్యవసర విధానాలు, ఎలా స్పందించాలనే దానిపై అవగాహన ప్రచారాలు, మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించడం.

4. పర్యావరణ వ్యవస్థ నిర్వహణ (Ecosystem Management): మడ అడవులను పునరుద్ధరించడం మొదలైనవి చేయడం ద్వారా తుపాను ఉప్పెనలు, వరదలు లాంటి వాటినుంచి నేలకోతను రక్షించవచ్చు.

5. భూ వినియోగ ప్రణాళిక (Land-use Planning): వరద మైదానాలు, కొండ చరియలు విరిగిపడే ముప్పున్న ప్రాంతాలతోపాటు ఇతర అధిక దుర్భలత్వ ప్రదేశాల్లో నగరాల పెరుగుదల, ఇతర అభివృద్ధిని పరిమితం చేయడం. 

చారిత్రక నేపథ్యం

విపత్తుల నిర్వహణలో చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించేందుకు ఒక రోజును ఏర్పాటు చేయాలని ఐక్యరాజ్య సమితి భావించింది. 1989లో ఐరాస జనరల్‌ అసెంబ్లీ ‘ఇంటర్నేషనల్‌ డే ఫర్‌ నేచురల్‌ డిజాస్టర్‌ రిడక్షన్‌’ను ఏర్పాటు చేసింది. మొదట్లో ఏటా అక్టోబరు రెండో బుధవారం దీన్ని పాటించేవారు. 2009, డిసెంబరు 21న ఐరాస జనరల్‌ అసెంబ్లీ దీని పేరును ‘అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినోత్సవం’గా మార్చి; ఏటా అక్టోబరు 13న నిర్వహించాలని తీర్మానించింది. 

విపత్తు తగ్గింపు కీలకాంశాలు, హ్యోగో కార్యాచరణ ప్రణాళిక, సెండాయ్‌ చట్రం తదితర కీలక సమాచారంతోపాటు గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్‌-4, తెలంగాణ పోలీస్‌ ఎస్‌ఐ మెయిన్స్, టీఎస్‌ పంచాయత్‌ సెక్రటరీ, టీజీపీఎస్సీ ఏఈఈ, టీఎస్‌పీఎస్సీ ఏఎస్‌ఓ, ఆర్‌ఆర్‌బీ తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన  ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కాంబో కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ మీ కోసం..! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. విపత్తు తగ్గింపునకు సంబంధించిన సెండ్రాయ్‌ ఫ్రేమ్‌వర్క్‌ ఏ సంవత్సరం వరకు అమల్లో ఉంటుంది?

(టీఎస్‌పీఎస్సీ ఏఎస్‌ఓ, 2017)

1) 2025    2) 2030      3) 2040       4) 2050

సమాధానం: 2

2. విపత్తు నిర్వహణలో కింది ఏది ఉంటుంది?

(ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4, 2012)

1) పునరావాసం                2) పునర్‌నిర్మాణం

3) ఉపశమనం                 4) పైవన్నీ

సమాధానం: 4

3. అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?

(టీఎన్‌యూఎస్‌ఆర్‌బీ కానిస్టేబుల్, 2018), (యూపీఎస్‌ఎస్‌స్సీ పీఈటీ, 2023),

(ఓపీఎస్సీ ఓఏస్, 2017), (పంజాబ్‌ పోలీస్‌ కానిస్టేబుల్, 2023),

1) అక్టోబరు 12                 2) అక్టోబరు 13

3) అక్టోబరు 11              4) మార్చి 13

సమాధానం: 2

4. యునైటెడ్‌ నేషన్స్‌ ఇంటర్నేషనల్‌ స్ట్రాటజీ ఫర్‌ డిజాస్టర్‌ రిడక్షన్‌ (యూఎన్‌ఐఎస్‌డీఆర్‌)ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?

(కేసెట్, 2016)

1) 1999          2) 2001            3) 1996           4) 1998

సమాధానం: 1

5. The International Day for Disaster Risk Reduction (IDDRR) 2025 is observed under which theme?
(RRB NTPC Graduate Level CBT-II, 2026)
1) Investing in Sustainable Futures
2) Strengthening Early Warning Systems
3) Fund Resilience, Not Disasters
4) Rebuilding Communities Together
Ans: 3
6. As part of Tripura’s tech-driven disaster preparedness initiative launched in August 2025, how many automated weather stations and rain gauges are proposed to be installed?
(RRB Group D, 2026)
1) 14        2) 10        3) 26        4) 15
Ans: 3
7. Who among the following received the United Nations Sasakawa Award 2025 for Disaster Risk Reduction?
(RRB Group D, 2025)
1) Randeep Guleria            2) Dr. Soumya Swaminathan
3) Dr. Shekhar Mande            4) Dr. Mrityunjay Mohapatra
Ans: 4
8. Hyogo Framework for Action (HFA) 2005-2015 is related to:
(UGC NET Paper 2, Public Administration, 2026)
1) Gender-budgeting            2) Disaster Management
3) Sunset Legislation            4) Performance Budget
Ans: 2

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram