జాతీయ తపాలా దినోత్సవం

జాతీయ తపాలా దినోత్సవం

ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేసింది. నూతన సాంకేతికత ఫలితంగా కమ్యూనికేషన్‌ రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంత దూరంలో ఉన్నారనే దానితో సంబంధం లేకుండా క్షణాల్లో సమాచారాన్ని చేర్చే స్థాయికి ఎదిగాం. అయితే ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్స్, మొబైల్‌ - టెలీఫోన్ల కంటే ముందు సమాచార మార్పిడికి ఉన్న ముఖ్యమైన సాధనం తపాలా. సమాచార వ్యవస్థలో మొదటి అడుగుగా దీన్ని పేర్కొంటారు. నేటికీ మన దేశంలో పోస్టల్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. దీనికి శతాబ్దాల చరిత్ర ఉంది. అవసరాలకు తగ్గట్లు ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ, ఆధునిక ధోరణులను అనుసరిస్తూ విజయవంతంగా కొనసాగుతోంది. పోస్టల్‌ వ్యవస్థ గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో మన దేశంలో ఏటా అక్టోబరు 10న ‘జాతీయ తపాలా దినోత్సవం’గా (National Post Day) నిర్వహిస్తారు. ఎన్నో ఏళ్లుగా మన జీవితాల్లో భాగంగా నిలిచిన భారత తపాలా శాఖ ఔన్నత్యాన్ని తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

ఇండియన్‌ పోస్టల్‌ సర్వీస్‌

  • దీన్నే ఇండియా పోస్ట్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పోస్ట్‌ పేర్లతోనూ పిలుస్తారు. ఇది భారతదేశంలో అత్యంత పురాతన ప్రభుత్వ తపాలా వ్యవస్థ. మినిస్ట్రీ ఆఫ్‌ కమ్యూనికేషన్స్‌ అధీనంలో పనిచేస్తుంది. ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది. దాన్ని డాక్‌ భవన్‌ అంటారు. ఉత్తరాల పంపిణీ, గ్రామీణ తపాలా జీవిత బీమా, తపాలా జీవిత బీమా సౌకర్యాలు, డిపాజిట్ల స్వీకరణ, పెన్షన్ల పంపిణీతో సహా ఎన్నో సేవలు అందిస్తుంది.
  • 1972, ఆగస్టు 15న కమ్యూనికేషన్స్‌ మంత్రిత్వశాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్న శ్రీరామ్‌ భికాజీ వెలంకర్‌ ఆరు అంకెల పోస్టల్‌ ఇండెక్స్‌ నంబర్‌ (పీఐఎన్‌ - పిన్‌) విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇండియా పోస్ట్‌ను పోస్టల్‌ సర్వీసెస్‌ బోర్డ్‌ నిర్వహిస్తుంది. ఇందులో ఒక ఛైర్మన్, ఏడుగురు సభ్యులు ఉంటారు. ప్రస్తుతం సుబ్రత్‌ దాస్‌ దీనికి ఛైర్మన్‌గా (2026, అక్టోబరు 10 నాటికి) ఉన్నారు.
  • ఇండియా పోస్ట్‌ ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టల్‌ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.  డిపార్ట్‌మెంట్స్‌ ఆఫ్‌ పోస్ట్‌ గణాంకాల ప్రకారం మన దేశంలో మొత్తం 1,64,999 పోస్టాఫీసులు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. వీటిలో అర్బన్‌ ప్రాంతాల్లో 15,614; గ్రామీణ ప్రాంతాల్లో 1,49,385 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 10,606; తెలంగాణలో 6,212 తపాలా కార్యాలయాలున్నాయి.
  • డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పోస్ట్స్‌లో దాదాపు 4,57,997 మంది సిబ్బంది పని చేస్తున్నారు. సగటున ఒక తపాలా కార్యాలయం దేశంలో 7339 మందికి సేవలు అందిస్తుంది. మొత్తం 810 ప్రధాన తపాలా కార్యాలయాలు; 24,281 ఉప తపాలా కార్యాలయాలు; 1,39,908 బ్రాంచ్‌ ఆఫీస్‌లు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి.

చారిత్రక నేపథ్యం

ఈస్టిండియా కంపెనీ తన వ్యాపార అవసరాల నిమిత్తం భారత్‌లో పోస్టల్‌ సేవలను ప్రవేశపెట్టింది. అధికారికంగా 1854, అక్టోబరు 10న మన దేశంలో ఇండియన్‌ పోస్టల్‌ సర్వీస్‌ను ప్రారంభించారు. దీనికి గుర్తుగా ఏటా ఆ తేదీన ‘జాతీయ తపాలా దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు. 2011 నుంచి ఏటా దీన్ని జరుపుతున్నారు. ‘వరల్డ్‌ పోస్ట్‌ డే’ను ప్రపంచవ్యాప్తంగా ఏటా అక్టోబరు 9న నిర్వహిస్తారు.   

భారతదేశంలో తపాలా వ్యవస్థ పరిణామక్రమం, పరిపాలనా వ్యవస్థ, రాజ్యాంగ వివరణ - అందించే సేవలతోపాటు గతంలో ఏపీ పోలీస్‌ ఎస్‌ఐ ప్రిలిమినరీ, ఎస్‌బీఐ క్లర్క్‌ మెయిన్స్, ఎస్‌ఎస్‌సీ, రైల్వే, యూజీసీ నెట్‌ తదితర పోటీపరీక్షల్లో ఈ టాపిక్‌ నుంచి అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సుII’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ప్రపంచ తపాలా దినోత్సవాన్ని అంతర్జాతీయంగా ఏటా ఎప్పుడు జరుపుకుంటారు?

(కర్ణాటక పోలీస్‌ కానిస్టేబుల్‌ (సీఏఆర్‌/ డీఏఆర్‌), 2019),

(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ టైర్‌-1, 2023),

(ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌-డి, 2025)

1) అక్టోబరు 8                2) అక్టోబరు 9

3) అక్టోబరు 10               4) అక్టోబరు 11

సమాధానం: 2

2. ఇండియా పోస్ట్‌కి చెందిన స్పీడ్‌ పోస్ట్‌ను కింది ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

(ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్, 2025)

1) 1986   2) 1991   3) 1976    4) 1980

సమాధానం: 1

3. జాతీయ తపాలా దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?

(యూపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ రీ-ఎగ్జామ్, 2024),

(ఎంపీ పట్వారీ గ్రూప్‌ 2, 2023),

(ఎంపీఎస్సీ గ్రూప్‌-బి అండ్‌ గ్రూప్‌-సి కంబైన్డ్‌ ప్రిలిమ్స్, 2023),

(ఎస్‌ఎస్‌సీ మెట్రిక్‌ లెవల్, 2022)

1) అక్టోబరు 3                2) అక్టోబరు 9

3) అక్టోబరు 10               4) అక్టోబరు 15

సమాధానం: 3

4. 1774లో కింది ఎవరు మన దేశంలో పోస్టల్‌ సేవలను అందుబాటులోకి తెచ్చారు?

(ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్, 2019)

1) లార్డ్‌ రిప్పన్‌                 2) లార్డ్‌ డల్హౌసీ

3) వారెన్‌ హేస్టింగ్స్‌              4) లార్డ్‌ లిట్టన్‌

సమాధానం: 3

 5. The Postal Index Number (PIN) is a six digit code used by Indian postal department, what does the first two digit of the code (taken together) stands for:
(RRB NTPC CBT-I, 2021)
1) Delivery post office 
2) District
3) Sub region or one of the postal circles 
4) Municipal corporation 
Ans: 3 
6. What is the Indian postal network famous for in the world?
(SSC GD Constable, 2023)
1) It is the oldest postal network    2) It is the smallest postal network
3) It is the largest postal network    4) It is the cheapest postal network
Ans: 3
7. Choose correct statements regarding postal services
i. Postal system was established in India by Lord Clive in 1766.
ii. India post payment bank (IPPB) was setup in 2016.
iii. 'Philately' is the hobby of collecting stamps, study of postal history.
(UGC NET,  2025)
1) i, ii            2) i, iii        3) ii, iii        4) i, ii, iii
Ans: 4
8. What is the name of the new premium express service launched by India Post to provide a guaranteed next-day delivery (D+1) for urgent shipments?
(RRB NTPC (Graduate) CBT-I, 2026)
1) Speed Post Plus                2) 24 Speed Post
3) India Post Prime            4) Metro Express 24
Ans: 2
9. Where is the highest post office situated in Himachal?
(HP TGT (Medical), 2017)
1) Hidimba (Manali)    2) Hikkim (Spiti)
3) Hatsar (Bharmaur)    4) Karsog (Mandi)
Ans: 2 

 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram