ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) అనేది భారత సాయుధ దళాల వైమానిక విభాగం. దేశ భద్రత, సమగ్రతను కాపాడటంలో ఇది ఎప్పుడూ ముందుంటుంది. మన దేశ వైమానిక పరిధిని సురక్షితంగా చూసుకోవడం, శత్రు దేశాలతో సంఘర్షణ పరిస్థితులు తలెత్తినప్పుడు యుద్ధంలో పాల్గొనడం దీని విధి. క్లిష్టమైన భూభాగాలు, వాతావరణాల్లో భారత సైన్యానికి ఎయిర్ లిఫ్ట్ మద్దతు, లాజిస్టిక్స్ సరఫరాతోపాటు విపత్తుల సమయంలో సామాన్య ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేయడంలోనూ ఇది కీలకంగా పనిచేస్తుంది. మన దేశ వైమానిక దళం ఏర్పాటుకు గుర్తుగా ఏటా అక్టోబరు 8న ‘భారత వైమానిక దళ దినోత్సవం’గా (Indian Air Force - IAF Day) నిర్వహిస్తారు. ఇండియన్ ఆర్మీకి భారత వాయుదళం అందించిన సహకారం, వాయుసేన వివిధ యుద్ధాల్లో చూపిన పోరాట పటిమ గురించి తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో 1932 అక్టోబరు 8న రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ బ్రిటన్‌కు సహాయక విభాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ను స్థాపించారు. 1933 ఏప్రిల్ 1న ఇది ఉనికిలోకి వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం బ్రిటిష్ ప్రభుత్వం దీని పేరును రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌గా మార్చింది. 1950లో భారతదేశం గణతంత్ర రాజ్యంగా మారినప్పుడు రాయల్ అనే పదాన్ని తొలగించారు.
|
ఐఏఎఫ్ పనితీరు, ఆయా కమాండ్స్ ఉన్న ప్రాంతాలు, ప్రధాన కార్యాలయాలు - ప్రస్తుత అధిపతులు, ఐఏఎఫ్ సాధించిన ముఖ్యమైన విజయాలతోపాటు గతంలో తెలంగాణ పోలీస్ ఎస్ఐ ప్రిలిమినరీ, తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్, ఆర్ఆర్బీ - ఎన్టీపీసీ, గ్రూప్-డి, ఎస్ఎస్సీ, యూపీఎస్సీ తదితర పోటీపరీక్షల్లో అడిగిన 75కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సుII’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. భారత వైమానిక దళం నినాదం?
(డబ్ల్యూబీపీఎస్సీ మిస్లేనియస్, 2024)
1) టచ్ ది స్కై విత్ గ్లోరీ 2) కరేజ్ అండ్ సాక్రిఫైస్
3) సర్వీస్ బిఫోర్ సెల్ఫ్ 4) స్ట్రెంథ్ ఇన్ యూనిటీ
సమాధానం: 1
2. దేశ రక్షణ రంగంలో భారత వైమానిక దళం పాత్ర ఏమిటి?
(అగ్నివీర్ ఆర్మీ జీడీ, 2025)
1) దాడుల నుంచి భారత వైమానిక ప్రాంతాన్ని విస్మరించడం
2) దాడుల నుంచి భారత వైమానిక ప్రాంతాన్ని రక్షించడం
3) దాడుల నుంచి భారత సైన్యాన్ని రక్షించడం
4) దాడుల నుంచి భారత నావికా దళాన్ని రక్షించడం
సమాధానం: 2
3. భారత వైమానిక దళ దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన జరుపుకుంటారు?
(యూపీఎస్ఎస్ఎస్సీ పీఈటీ, 2022), (ఎంపీ పట్వారీ, 2017),
(బిహార్ పోలీస్ ఎస్ఐ, 2021), (ఎస్జేవీఎన్ఎల్ జేఈ ఎలక్ట్రికల్, 2018),
(ఎస్ఎస్సీ హెచ్ఎస్సీ లెవల్, 2019), (ఏసీసీ 124 సీజీఎటీ, 2021),
(కర్ణాటక సివిల్ పోలీస్ కానిస్టేబుల్, 2019)
1) ఫిబ్రవరి 8 2) సెప్టెంబరు 8
3) అక్టోబరు 8 4) నవంబరు 8
సమాధానం: 3
4. భారత వైమానిక దళానికి కింది ఎవరు సుప్రీం కమాండర్‌గా వ్యవహరిస్తారు?
(ఎస్ఎస్సీ హెచ్ఎస్సీ లెవల్, 2019)
1) కేంద్ర హోంశాఖ మంత్రి 2) ప్రధానమంత్రి
3) రక్షణ మంత్రి 4) భారత రాష్ట్రపతి
సమాధానం: 4
5. Which of the following Air Chiefs in India was commissioned into the fighter stream of IAF in Dec 1984?
(SSC CGL, 2025)
1) RKS Bhadauria 2) AP Singh
3) B S Dhanoa 4) Vivek Ram Chaudhari
Ans: 2
6. What is the rank of Indian Air Force (IAF) on the World Air Power Index in terms of the total fighting strength of the various air services of different nations of the world?
(Agniveer Army GD, 2025)
1) 2nd 2) 3rd 3) 4th 4) 5th
Ans: 2
7. Which of the following exercises was conducted by the Indian Air Force (IAF) in April 2025 to simulate attacks on mountain and ground targets using advanced fighter jets like Rafale and Su-30MKI?
(RRB NTPC (UG) CBT-I, 2025)
1) Vayu Shakti 2) Meghdoot
3) Aakraman 4) Gagan Shakti
Ans: 4
8. The Indian Airforce and Army jointly conducted the Vayu-Prahar Exercise in which of the following theatre commands?
(RPF SI CBT-I, 2024)
1) Northern Theatre 2) Eastern Theatre
3) Western Theatre 4) Southern Theatre
Ans: 2