ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం

ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం

దేశ భవిష్యత్తుకి యువతరమే ఆధారం. వారు సక్రమంగా ఉంటేనే సమాజం అన్ని విధాలా ముందుకు సాగుతుంది. వారిలో సత్ప్రవర్తన, మంచి ఆలోచనలు, దేశం పట్ల భక్తిభావం, సమాజం - పెద్దల పట్ల గౌరవం, అంకితభావాలను పెంపొందించడంలో గురువు కీలకపాత్ర పోషిస్తారు. తరగతి గదిలో వారు తమ శిష్యులకు చదువుతోపాటు విలువలు, జ్ఞానంతో కూడిన జీవిత నైపుణ్యాలను పెంపొందిస్తారు. తద్వారా ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేలా వారికి ఉపాధ్యాయులు సాయం చేస్తారు. విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్రను గౌరవించుకునేందుకు ఏటా అక్టోబరు 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని (World Teachers’ Day) నిర్వహిస్తారు. దీన్నే అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం (International Teachers Day) అని కూడా అంటారు.  భవిష్యత్తు తరాలను అభివృద్ధి చేయడంలో ఉపాధ్యాయుల కృషిని గుర్తించడంతోపాటు ఆ వృత్తి గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

  • ఐక్యరాజ్యసమితి 2030 నాటికి సాధించాలనుకుంటోన్న 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో నాలుగోది నాణ్యమైన విద్య. ఇటీవల ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) విడుదల చేసిన ‘గ్లోబల్‌ రిపోర్ట్‌ ఆన్‌ టీచర్స్‌: అడ్రెసింగ్‌ టీచర్స్‌ షార్టేజెస్‌’ అనే నివేదిక ప్రకారం 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 4.4 కోట్ల ప్రాథమిక, మాధ్యమిక గురువుల లోటు ఉంటుందని అంచనా.  
  • మన దేశంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ఏటా సెప్టెంబరు 5న మన దేశంలో ‘ఉపాధ్యాయ దినోత్సవం’గా నిర్వహిస్తారు. చైనాలో ఏటా సెప్టెంబరు 10న నిర్వహిస్తారు. 1951లో చైనీస్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ స్థాపనకు గుర్తుగా ఆ తేదీని ఎంచుకున్నారు. 1985లో మొదటిసారి జరిపారు. రష్యాలో యునెస్కో తీర్మానించిన అక్టోబరు 5నే ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తారు.
  • అమెరికాలో మే నెలలోని మొదటి మంగళవారం నాడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా పాటిస్తారు. 1984 నుంచి ఏటా నిర్వహిస్తున్నారు. థాయ్‌లాండ్‌లో ఏటా జనవరి 16న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రిన్స్‌ డామ్రాంగ్‌ రాజనుభాబ్‌ (Prince Damrong Rajanubhab) జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ తేదీని ఎంచుకున్నారు. ఆయన 1892 నుంచి 1915 వరకు ఆ దేశ విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.  

చారిత్రక నేపథ్యం

  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయుల స్థితిగతులను తెలుసుకునే ఉద్దేశంతో అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ), యునెస్కో 1966, అక్టోబరు 5న పారిస్‌లో ఒక సమావేశాన్ని నిర్వహించింది. అందులో టీచర్ల హక్కులు, బాధ్యతలకు సంబంధించి వివిధ ప్రమాణాలను నిర్దేశించారు. ఈ సమావేశానికి గుర్తుగా ఏటా అక్టోబరు 5న ‘ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం’గా జరుపుకోవాలని 1994లో యునెస్కో తీర్మానించింది. అప్పటి నుంచి ప్రతి సవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. బోధన అంటే ఏమిటి?

(మహా టెట్, 2024)

1) జ్ఞానాన్ని అందించడం            

2) ఉపన్యాసం ఇవ్వడం

3) అభ్యసనాన్ని ప్రోత్సహించడం        

4) అభ్యసనానికి అనుకూల వాతావరణాన్ని సృష్టించడం

సమాధానం: 3

2. బోధనా పద్ధతి అంటే?

(బిహార్‌ సీఈటీ బి.ఎడ్, 2024)

1) ఉదాహరణ                2) వివరణ

3) స్పష్టీకరణ                 4) పైవన్నీ

సమాధానం: 4

3. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?

(ఆర్‌బీఐ గ్రేడ్‌ బి, 2019), (ఎయిర్‌ఫోర్స్‌ గ్రూప్‌ వై ఎంబీటీ, 2021),(ఓఎస్‌ఎస్‌ఎస్‌సీ ఫారెస్ట్‌ గార్డ్, 2024)

1) అక్టోబరు 4               2) అక్టోబరు 5

3) అక్టోబరు 6               4) అక్టోబరు 7

5) అక్టోబరు 8

సమాధానం: 2

4. కిందివాటిలో ఏది బోధన స్థాయి?

(హెచ్‌టెట్‌ టీజీటీ సోషల్‌ సైన్స్, 2011)

1) రిఫ్లెక్టివ్‌                2) ఇంటరాక్టివ్‌

3) ప్రొజెక్టివ్‌              4) సమ్మెటివ్‌

సమాధానం: 1

5. Which of the following strategies can be used for making classroom teaching effective?
(i) Use of suitable teaching aids
(ii) Effective Communication Skills
(iii) Asking students to write and memorise
(iv) Discussion in classroom
(v) Using multimedia tools
Choose the correct answer from the options given below:
(UGC NET, 2022)

1) (i), (ii) and (iv) only        2) (ii), (iii) and (v) only

3) (i), (ii), (iv) and (v) only    4) (i), (ii), (iii) and (v) only

Ans: 3

6. What is pedagogy primarily focused on?
(DSSSB PRT, 2026)

1) A student-led discovery process

2) A teacher-led learning process

3) A collaborative project-based process

4) A technology-driven learning process

Ans: 2

7. Arrange the following teaching methods (from simple to complex):
(i) Discovery method
(ii) Problem-Solving method
(iii) Demonstration method
(iv) Project method
Choose the most appropriate answer from the options given below:
(CUET PG B.Ed, 2025)

1) (iii), (ii), (i), (iv)          2) (ii), (iii), (i), (iv)

3) (iv), (iii), (ii), (i)          4) (i), (ii), (iii), (iv)

5) Question not attempted

Ans: 1

8. Arrange the following steps in a Herbartian method of teaching in sequence.
i. Generalization
ii. Application
iii. Preparation
iv. Comparison
v. Presentation
Choose the correct answer from the options given below :
(UGC NET, 2026)

1) i, ii, iii, iv, v        2) iii, v, iv, i, ii        

3) ii, iii, iv, v, i        4) iii, iv, v, i, ii

Ans: 2 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram