అంతర్జాతీయ అహింసా దినోత్సవం

అంతర్జాతీయ అహింసా దినోత్సవం

సత్యం, అహింస ఎప్పటి నుంచో భారతీయ సమాజంలో వేళ్లూనుకున్నాయి. తరతరాలుగా ప్రపంచంలోని అన్ని సమాజాలు వాటిని గౌరవిస్తూనే ఉన్నాయి. అయితే ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని విడవకుండా, తన తోటివారు కూడా ఆచరించేలా చేయడంలో గాంధీజీ విజయం సాధించారు. హింసతో ఏదీ సాధించలేం, అహింసతోనే విజయం దక్కుతుందనే గాంధీ సిద్ధాంతం దేశానికి స్వరాజ్యం తెచ్చింది. విశ్వవ్యాప్తంగా ఉన్న ఎందరో పోరాటయోధులకు ప్రేరణగా నిలిచి, శాంతి మార్గంలో నడిచేలా చేసింది. భారత స్వాతంత్య్రోద్యమ నాయకుడు, అహింసావాది అయిన మహాత్మా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏటా అక్టోబరు 2న ‘అంతర్జాతీయ అహింసా దినోత్సవం’ (International Day of Non-Violence) గా నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఐక్యత, శాంతి, సామరస్యాన్ని సాధించడంలో అహింస పాత్ర ఎంత గొప్పదో తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. 

  • గాంధీజీ పూర్తి పేరు మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ. ఆయన 1869, అక్టోబరు 2న గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో జన్మించారు. తండ్రి కరమ్‌చంద్‌ గాంధీ, తల్లి పుత్లీబాయి. గాంధీకి తన 12వ ఏట కస్తూరీబాయితో వివాహమైంది. 19వ ఏట బారిస్టర్‌ చదువు కోసం ఇంగ్లండ్‌ వెళ్లిన ఆయన 1893లో గుజరాత్‌కు చెందిన దాదా అబ్దుల్లా కంపెనీ కేసు నిమిత్తం దక్షిణాఫ్రికాలోని డర్బన్‌కు వెళ్లారు. 1894లో అక్కడే నేటల్‌ ఇండియన్‌ కాంగ్రెస్‌ను స్థాపించారు.  
  • గాంధీ దక్షిణాఫ్రికాలో జరుగుతున్న జాతి వివక్ష విధానాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారు. తన రాజకీయ గురువైన గోపాలకృష్ణ గోఖలే పిలుపుమేరకు 1915 జనవరి 9న భారతదేశానికి శాశ్వతంగా తిరిగి వచ్చారు. 1916లో అహ్మదాబాద్‌ సమీపంలోని సబర్మతి నది ఒడ్డున ఒక ఆశ్రమం స్థాపించి, ‘సత్యాగ్రహ ఆశ్రమం’ అని పేరు పెట్టారు. దీన్నే సబర్మతి ఆశ్రమం అని కూడా అంటారు.
  • ప్రధానమంత్రి జన్‌జాతీయ ఉన్నత్‌ గ్రామ్‌ అభియాన్‌ (పీఎం-జేయూజీఏ)దీన్ని ధర్తీ ఆబా జన్‌జాతీయ గ్రామ్‌ ఉత్కర్ష్‌ అభియాన్‌ (డీఏజేజీయూఏ) అని కూడా పిలుస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ 2024, అక్టోబరు 2న ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ప్రారంభించారు. గిరిజన సమాజాభివృద్ధితో దేశాభివృద్ధి అనే గాంధీజీ నినాదం దీనికి ప్రేరణ. 2026 నాటికి దేశవ్యాప్తంగా 5 కోట్లమందికి పైగా గిరిజనులు లబ్ధి పొందారు. 

చారిత్రక నేపథ్యం

మహాత్మా గాంధీ ప్రోత్సహించిన అహింసా విధానాలను విశ్వవ్యాప్తం చేసే లక్ష్యంతో ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలని ఐక్యరాజ్య సమితి భావించింది. ఇందుకు అనుగుణంగానే ఆయన జన్మదినమైన అక్టోబరు 2న ప్రతి సంవత్సరం ‘అంతర్జాతీయ అహింసా దినోత్సవం’గా జరుపుకోవాలని యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీ 2007, జూన్‌ 15న తీర్మానించింది. అప్పటి నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.

గాంధీజీ చేపట్టిన ఉద్యమాల కాలక్రమం,  ఇతర ముఖ్యాంశాలు,  ఆయన సిద్ధాంతాల ఆధారంగా ప్రభుత్వం రూపొందించిన ఇతర కార్యక్రమాలతోపాటు యూపీఎస్సీ సివిల్స్, ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1, టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1, తెలంగాణ పోలీస్‌ ఎస్‌ఐ మెయిన్స్, ఏపీపీఎస్సీ ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ - ప్రిలిమ్స్, మెయిన్స్, టీజీపీఎస్సీ ఏఈఈ, ఎస్‌బీఐ అప్రెంటిస్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పీవో, తదితర పోటీపరీక్షల్లో అడిగిన 125కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సుII’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. అహింస అనేది ధైర్యసాహసాలకు పరాకాష్ట అని ఎవరు అన్నారు?

(యూపీ పోలీస్‌ ఎస్‌ఐ, 2021)

1) సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌            2) మహాత్మా గాంధీ

3) బాలగంగాధర్‌ తిలక్‌                      4) దయానంద సరస్వతి

సమాధానం: 2

2. అహింస అనే భావన కింది దేనికి సంబంధించింది?

(ఎంహెచ్‌ సెట్, 2016)

1) ప్రగతిశీల సమాజాలు            2) కీటకాలు, జంతువులు

3) దేవుడు                                  4) సమస్త జీవరాశి

సమాధానం: 4

3. అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?

(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ టైర్‌ 1, 2022),  (మహారాష్ట్ర పోలీస్‌ డ్రైవర్‌ కానిస్టేబుల్, 2024),

(హెచ్‌ఎస్‌ఎస్‌సీ హరియాణా పోలీస్‌ కానిస్టేబుల్, 2021), (ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2024),

(ఎంఎస్‌టెట్‌ సోషల్‌ సైన్స్, 2019), (యూపీ పోలీస్‌ కంప్యూటర్‌ ఆపరేటర్, 2025),

(దిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్‌ (ఎగ్జిక్యూటివ్‌), 2023), 

(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ టైర్‌ 1, 2024), 

(ఎస్‌ఎస్‌సీ సెలక్షన్‌ పోస్ట్‌ (గ్రాడ్యుయేట్‌ లెవల్‌), 2024), 

(యూపీఎస్‌ఎస్‌సీ పీఈటీ, 2022)

1) ఆగస్టు 15                    2) అక్టోబరు 31

3) అక్టోబరు 2                   4) నవంబరు 14

సమాధానం: 3

4. కింది ఎవరి జయంతిని పురస్కరించుకుని అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని జరుపుకుంటారు?

(పీఎస్‌ఎస్‌ఎస్‌బీ లేబర్‌ ఇన్‌స్పెక్టర్, 2025)

1) జవహర్‌లాల్‌ నెహ్రూ            2) భగత్‌సింగ్‌

3) సుభాష్‌ చంద్రబోస్‌                4) మహాత్మా గాంధీ

సమాధానం: 4

5. In India, the International Day of Non-Violence is also celebrated as __________.
(SSC CPO Paper-I, 2024)
1) Swami Vivekanand Jayanti            2) Gandhi Jayanti
3) Guru Ravidas Jayanti                     4) Mahavir Jayanti
Ans: 2
6. The North-West Frontier Province’s non-violent mass organisation, the Khudai Khidmatgars (Red Shirts), was led by:
(RRB NTPC (UG) CBT-I, 2026)
1) Khan Abdul Qayyum                2) Maulana Azad
3) Abdul Ghaffar Khan                  4) Shaukat Ali
Ans: 3
7. Consider the following statements regarding non-violence :
(i) The Ancient Buddhist Scripture 'Suttnipat' considers non-violence to be the greatest virtue.
(ii) It is mentioned in the 'Brahmin Dhammik sutra' of ‘Suttnipat’, that animals should be protected.
(RPSC Assistant Professor, 2021)
1) Only (i) is correct                       2) Only (ii) is correct
3) Both (i) and (ii) are correct        4) neither (i), nor (ii) is correct
Ans: 3
8. Consider the following statements :
i. Mahatma Gandhi wrote a book, ‘Indian Opinion’, to apprise the British Government of the widespread discontent among Indians.
ii. ‘Hind Swaraj’, written by Mahatma Gandhi in Gujarati in 1909 was proscribed by the Government of Bombay and then in 1910 it was published in English in London.
Which of the above statements is/are correct ?
(TSPSC Group 1 (Prelims),  2024)
1) i only        2) ii only        3) Both i and ii        4) Neither i nor ii 
Ans: 4 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram