వరల్డ్‌ హార్ట్‌ డే

వరల్డ్‌ హార్ట్‌ డే

రక్తప్రసరణ వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన భాగం హృదయం. ఇది మన శరీరంలో అత్యంత చురుకైన కండరం కూడా. అవయవాల నుంచి వచ్చే చెడు రక్తాన్ని ఊపిరితిత్తుల్లోకి చేరవేసి, అక్కడ ఆక్సిజన్‌తో నిండిన మంచి రక్తాన్ని అవయవాలకు పంప్‌ చేస్తూ, ప్రాణాలను నిలబెడుతోంది. జీవుల శరీరంలో ప్రధాన అవయవమైన గుండె, దాని విధులు, ఆవశ్యకతను చాటిచెప్పే లక్ష్యంతో ఏటా సెప్టెంబరు 29న ‘వరల్డ్‌ హార్ట్‌ డే’గా నిర్వహిస్తారు. హృదయ సంబంధ వ్యాధుల గురించి అవగాహన కల్పించడంతోపాటు వాటిని నివారించే మార్గాలను ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

  • ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గణాంకాల ప్రకారం, గుండె జబ్బుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 1.79 కోట్ల నుంచి 2.05 కోట్ల మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంభవించే మొత్తం మరణాల్లో వీటి వాటా 32శాతంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో 52 కోట్ల మంది ప్రజలు హృదయ సంబంధ రుగ్మతలతో బాధపడుతున్నట్లు అంచనా.
  • గుండె పోటు కేసులు భారతదేశంలోనూ ఎక్కుగానే నమోదవుతున్నాయి. నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌ఓ) 80వ రౌండ్‌ సర్వే - 2025 ప్రకారం 2017-18తో పోలిస్తే దేశంలో గుండె జబ్బుల కేసులు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. ఆ సమయంలో ప్రతి లక్ష జనాభాకు 1333గా ఉన్న ఈ కేసులు 2025 నాటికి 3891కి చేరాయి. దేశంలో గుండె రుగ్మత అతిపెద్ద సమస్యగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 
  • ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పెరుగుతోన్న హృదయ సంబంధ వ్యాధులను నివారించే లక్ష్యంతో 1978లో జెనీవా కేంద్రంగా వరల్డ్‌ హార్ట్‌ ఫెడరేషన్‌ (డబ్ల్యూహెచ్‌ఎఫ్‌) అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పడింది. మొదట్లో దీని పేరు ఇంటర్నేషనల్‌ సొసైటీ అండ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ కార్డియాలజీగా ఉండేది. 1998లో దీన్ని డబ్ల్యూహెచ్‌ఎఫ్‌గా మార్చారు. ఇది ప్రపంచవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తోంది.
  • ఆంటోని బేయస్‌ డి లూనా 1997-99లో డబ్ల్యూహెచ్‌ఎఫ్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. డబ్ల్యూహెచ్‌ఓ సహకారంతో గుండె జబ్బుల నివారణపై ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రచారాన్ని రూపొందించాలని ఆయన భావించారు. ఇందులో భాగంగా ఏటా సెప్టెంబరు నెలలో వచ్చే చివరి ఆదివారం నాడు ‘వరల్డ్‌ హార్ట్‌ డే’గా జరుపుకోవాలని 1999లో ఆయన ప్రతిపాదించారు. 2000 నుంచి 2011 వరకు దీన్ని అలాగే నిర్వహించారు.
  • 2012లో ‘వరల్డ్‌ హార్ట్‌ డే’ను ఏటా సెప్టెంబరు 29న నిర్వహించాలని డబ్ల్యూహెచ్‌ఓ తీర్మానించింది. 

మానవ గుండె నిర్మాణం, విధులు, పనితీరుతోపాటు గతంలో ఈ అంశంపై ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ, ఏపీపీఎస్సీ ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మెయిన్స్, ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌-డి, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీపరీక్షల్లో అడిగిన 85కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సుII’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. గుండె దేనితో నిర్మితమై ఉంటుంది?

(ఎంపీ పోలీస్‌ కానిస్టేబుల్, 2017)

1) సంయోజక కణజాలం    2) నాడీకణజాలం

3) కండర కణజాలం       4) ఏదీకాదు

సమాధానం: 3

2. మానవ గుండె కుడి భాగం ఏ రక్తాన్ని స్వీకరిస్తుంది?

(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, 2017)

1) శుద్ధ     2) అపరిశుభ్ర        3) మిశ్రమ   4) ఏదీకాదు

సమాధానం: 2

3. ‘వరల్డ్‌ హార్ట్‌ డే’ను ఏటా ఏ తేదీన జరుపుకుంటారు?

(ఎంపీ పోలీస్‌ కానిస్టేబుల్, 2023), (ఎంపీ ఎక్సైజ్‌ కానిస్టేబుల్, 2025),

(ఎస్‌ఎస్‌సీ జేఈ ఎంఈ, 2020), (యూపీ ఎన్‌హెచ్‌ఎం స్టాఫ్‌ నర్స్, 2021),

1) సెప్టెంబరు 28                2) సెప్టెంబరు 29

3) సెప్టెంబరు 30            4) సెప్టెంబరు 12

సమాధానం: 2

4. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకారం ప్రస్తుతం అత్యధిక సంఖ్యలో ప్రజల మరణాలకు కారణమవుతున్న వ్యాధి ఏది?

(టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ జేఎల్‌ఎం, 2022)

1) ఎయిడ్స్‌                 2) క్యాన్సర్‌

3) గుండె జబ్బు                 4) కొవిడ్‌ 19

సమాధానం: 3

5. Out of the following what is the busiest part of the human body?
(RRB Group D, 2022)
1) Eye        2) Hand        3) Femur        4) Heart
Ans: 4
6. Aves are warm-blooded animals and have a ________ heart.
(SSC MTS, 2022)
1) four-chambered            2) two-chambered
3) five-chambered            4) three-chambered
Ans: 1
7. In humans, which chamber of the heart receives oxygen-rich blood from the lungs first?
(CDS-I (General Knowledge), 2026)
1) Left atrium        2) Right atrium        
3) Left ventricle        4) Right ventricle
Ans: 1
8. Which chamber of the heart sends deoxygenated blood to the lungs for oxygenation?
(RRB ALP CBT-I, 2026)
1) Right ventricle        2) Right atrium
3) Left ventricle        4) Left atrium
Ans: 1

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram