జీవరాశి మనుగడకు సురక్షితమైన పర్యావరణం ముఖ్యం. ప్రగతి పేరుతో మనిషి విచక్షణారహితంగా చేస్తున్న పనులు విధ్వంసానికి, విపత్తులకు కారణమవుతున్నాయి. ప్రాణుల ఆరోగ్యం, పర్యావరణం మధ్య ఉన్న కీలక సంబంధాల గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా సెప్టెంబరు 26న ‘ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం’గా (World Environmental Health Day) నిర్వహిస్తారు. ప్రజా శ్రేయస్సు అనేది పరిసరాల నాణ్యతతో ముడిపడి ఉందని తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
పర్యావరణ ఆరోగ్యం అంటే?
పర్యావరణ ఆరోగ్యం అనేది ఒక నిర్దిష్ట ప్రాంతంలోని భౌతిక, రసాయన, జీవ, సాంస్కృతిక పరిస్థితులను కలిగి ఉంటుంది. పర్యావరణ ఆరోగ్యానికి సంబంధించిన నిర్దిష్ట సూచికలు ఏదైనా ప్రత్యేక ప్రాంతానికి చెందిన ఆవరణ వ్యవస్థ పనితీరును కొలవడానికి సాయపడతాయి. ఆ సూచీలు కింది విధంగా ఉన్నాయి.
1. కాలుష్య స్థాయి
2. జీవావరణ వైవిధ్యం
3. తాగునీటి లభ్యత
4. పారిశుద్ధ్య పరిస్థితులు
5. వ్యవసాయ ఉత్పత్తి
చారిత్రక నేపథ్యం
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ నిపుణులను ఏకం చేసే లక్ష్యంతో లండన్ కేంద్రంగా 1986లో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ (ఐఎఫ్‌ఈహెచ్) అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పడింది. పర్యావరణ రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఏటా సెప్టెంబరు 26న ‘ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం’గా జరుపుకోవాలని 2011లో ఈ సంస్థ తీర్మానించింది.
|
పర్యావరణ పరిరక్షణ చట్టాలు - కార్యక్రమాలు, పర్యావరణ పనితీరు సూచీ (ఈపీఐ) - 2026తోపాటు గతంలో తెలంగాణ పోలీస్ - ఎస్‌ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ, ఏపీఎస్‌ఎస్‌బీ ఫారెస్ట్ గార్డ్, ఎస్‌బీఐ పీవో, ఏపీ సెట్, యూజీసీ నెట్, ఆర్‌ఆర్‌బీ - ఎన్‌టీపీసీ, గ్రూప్-డి, ఎస్‌ఎస్‌సీ - సీజీఎల్, సీహెచ్‌ఎస్‌ఎల్ తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన 130కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సుII’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. భారత రాజ్యాంగంలోని కింది ఏ ఆర్టికల్ పర్యావరణం, వన్యప్రాణుల పరిరక్షణ గురించి తెలుపుతుంది?
(ఆర్‌ఆర్‌బీ నర్సింగ్ సూపరింటెండెంట్, 2026)
1) ఆర్టికల్ 38ఎ 2) ఆర్టికల్ 41ఎ
3) ఆర్టికల్ 48ఎ 4) ఆర్టికల్ 42ఎ
సమాధానం: 3
2. 2025, సెప్టెంబరు 26న నిర్వహించిన ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం ఇతివృత్తం ఏమిటి?
(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ (యూజీ), 2026)
1) మన గ్రహాన్ని రక్షించడం
2) అందరికీ నీరు
3) స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యవంతమైన ప్రజలు
4) ప్లాస్టిక్ రహిత భవిష్యత్తు
సమాధానం: 3
3. ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన జరుపుకుంటారు?
(యూజీసీ నెట్ పేపర్ 1, 2025), (ఆర్‌ఎస్‌ఎంఎస్‌ఎస్‌బీ స్టెనోగ్రాఫర్, 2021),
(ఎంపీపీఎస్సీ జీఎస్, 2015)
1) సెప్టెంబరు 26 2) ఆగస్టు 12
3) మార్చి 7 4) అక్టోబరు 2
సమాధానం: 1
4. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పర్యావరణ పరిరక్షణను ప్రతి పౌరుడి ప్రాథమిక విధిగా పేర్కొంటుంది?
(యూటెట్ పేపర్ 1, 2024)
1) ఆర్టికల్ 42 2) ఆర్టికల్ 48ఎ
3) ఆర్టికల్ 51(ఎ)(జి) 4) ఆర్టికల్ 52
సమాధానం: 3
5. Protection and improvement of environment and safeguarding of forests and wildlife of the country comes under
(UPSSSC PET, 2025)
1) Article 44A 2) Article 43A 3) Article 46A
4) Article 48A 5) None of the above
Ans: 4
6. When was the protection and improvement of environment and safeguarding of forests and wildlife as a directive added in the Constitution of India?
(RRB NTPC Graduate Level CBT-I, 2025)
1) 2002 2) 1978 3) 2011 4) 1976
Ans: 4
7. Which universities collaborate to produce the Environmental Performance Index (EPI)?
(SSC CGL, 2025)
1) Harvard & Stanford 2) Yale & Columbia
3) Oxford & Cambridge 4) MIT & Caltech
Ans: 2
8. Which country topped the Environmental Performance Index 2024?
(SSC CHSL Tier-1, 2025)
1) Estonia 2) Germany 3) Norway 4) Switzerland
Ans: 1