అంత్యోదయ దివస్‌

అంత్యోదయ దివస్‌

అంత్యోదయ అంటే సమాజంలోని చిట్టచివరి వ్యక్తి అభ్యున్నతి అని అర్థం. అత్యంత బలహీన వర్గాలకు సంక్షేమాన్ని అందించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. బడుగు జీవుల పట్ల ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనేదే పరిపాలన ప్రధాన కొలమానమని పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ విశ్వసించేవారు. పేదలు, ఆకలితో అలమటించేవారు, నిస్సహాయుల స్థితిగతులు మెరుగుపడితేనే మొత్తం సమాజం బలపడుతుందని ఆయన నమ్మకం. సామాజిక సమానత్వం, సామరస్యం కోసం నిర్విరామంగా కృషి చేసిన పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని ఏటా మన దేశంలో సెప్టెంబరు 25న ‘అంత్యోదయ దివస్‌’గా నిర్వహిస్తారు. ఇతరులకు సాయం చేయడం, వనరులు పంచుకోవడం, న్యాయపరమైన సమాజాన్ని నిర్మించడం లాంటి విలువల గురించి యువతకు తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. 

  • దీన్‌దయాళ్‌ 1916, సెప్టెంబరు 25న ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మధుర జిల్లాలో ఉన్న నాగ్లా చంద్రభన్‌లో జన్మించారు. దేశంలో సాంస్కృతిక జాతీయవాదాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 1947లో లఖ్‌నవూలో రాష్ట్ర ధర్మ ప్రకాశన్‌ అనే మాస పత్రికను ప్రచురించారు. 1948లో అటల్‌ బిహారీ వాజ్‌పేయీతో కలిసి పాంచజన్య అనే జాతీయవాద వారపత్రికను నెలకొల్పారు. 1947లో ఆయన హిందీలో సామ్రాట్‌ చంద్రగుప్త అనే చారిత్రక నాటకం/ నవల రాశారు. 
  • స్వదేశ్‌ అనే దినపత్రికను 1949లో లఖ్‌నవూలో ప్రారంభించారు. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) భావజాలం, ఆశయాలు ప్రచారం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. భారతదేశ మొదటి, రెండో పంచవర్ష ప్రణాళికలను విమర్శనాత్మకంగా విశ్లేషించడానికి దీన్‌దయాళ్‌ 1958లో ‘ది టూ ప్లాన్స్‌: ప్రామిస్, పెర్ఫార్మెన్స్, ప్రాస్పెక్ట్స్‌’ అనే పుస్తకాన్ని రాశారు. 1964లో సమగ్ర మానవతావాదం అనే పుస్తకాన్ని రచించారు.  

సమగ్ర మానవతావాద తత్వం

పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ 1965లో సమగ్ర మానవతావాద తత్వాన్ని అభివృద్ధి చేశారు. ఇది ఒక సామాజిక - రాజకీయ - ఆర్థిక సిద్ధాంతం. ఇది వ్యక్తి శారీరక, మేధో, భావోద్వేగ, ఆధ్యాత్మిక అంశాలతో సహా సంపూర్ణ అభివృద్ధిపై దృష్టి సారిస్తుంది.  అభివృద్ధి కేవలం ఆర్థిక వృద్ధికి మాత్రమే పరిమితమవకుండా నైతిక విలువలు, సాంస్కృతిక గుర్తింపు, సామాజిక సామరస్యంతో మిళితమై ఉండాలని ఈ తత్వం తెలుపుతుంది.

దీన్‌దయాళ్‌ స్ఫూర్తితో దేశంలో చేపట్టిన ప్రధాన జాతీయ పథకాలు, చారిత్రక నేపథ్యంతోపాటు ఈ అంశంపై గతంలో ఏపీపీఎస్సీ పంచాయతీ సెక్రెటరీ, తెలంగాణ పోలీస్‌ ఎస్‌ఐ - ప్రిలిమ్స్, మెయిన్స్, ఆర్‌ఆర్‌బీ క్లర్క్‌ మెయిన్స్, ఐబీపీఎస్‌ పీవో మెయిన్స్, ఆర్‌ఆర్‌బీ - గ్రూప్‌ డి, ఎన్‌టీపీసీ తదితర పోటీపరీక్షల్లో అడిగిన 80కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సుII’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ దేనికి ప్రసిద్ధి?

(బిహార్‌ టీఆర్‌ఈ 2.0 పీఆర్‌టీ (జనరల్‌ స్టడీస్‌), 2023)

1) కమ్యూనిజం                 2) పెట్టుబడిదారీ విధానం

3) సమగ్ర మానవతావాదం        4) పైవాటిలో ఒకటి కంటే ఎక్కువ

5) ఏదీకాదు

సమాధానం: 3

2. 1977లో ప్రారంభించిన అంత్యోదయ కార్యక్రమ ప్రధాన లక్ష్యం?

(ఎస్‌ఎస్‌సీ సెలక్షన్‌ పోస్ట్‌ (మెట్రిక్యులేషన్‌ లెవల్‌), 2025)

1) గ్రామీణ యువతకు ఉపాధి కల్పన

2) సమాజంలో అత్యంత పేద వర్గాల అభ్యున్నతి

3) పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడం

4) ఆర్థిక లోటును తగ్గించడం

సమాధానం: 2

3. ‘అంత్యోదయ దివస్‌’ను ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?

(ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్, 2023)

1) సెప్టెంబరు 22                2) సెప్టెంబరు 23

3) సెప్టెంబరు 24            4) సెప్టెంబరు 25

సమాధానం: 4

4. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కింది ఏ రోజును ‘దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన అంత్యోదయ దివస్‌’గా ప్రకటించింది?

(ఎంపీ మహిళా సూపర్‌వైజర్, 2017)

1) 2013, సెప్టెంబరు 20           2) 2014, సెప్టెంబరు 20

3) 2013, సెప్టెంబరు 25           4) 2013, సెప్టెంబరు 25

సమాధానం: 4

5. Antyodaya Anna Yojana (AAY) was launched by the government to fight         .
(SSC MTS, 2022)
1) unemployment                    2) poverty
3) environmental degradation            4) population growth
Ans: 2
6. The Swarna Jayanti Shahari Rozgar Yojana was replaced by __________ on 24 September 2013.
(SSC CGL, Finance and Accounting, 2022)
1) Jawaharlal Nehru National Urban Renewal Mission
2) Shyama Prasad Mukherji Rurban Mission
3) Deendayal Antyodaya Yojana-National Urban Livelihoods Mission 
4) Deendayal Antyodaya Yojana-National Rural Livelihoods Mission
Ans: 3 
7. Which government scheme aims to provide financial assistance to women Self-Help Groups (SHGs)?
(SSC CGL 2025)
1) Rashtriya Mahila Kosh (RMK)
2) Deendayal Antyodaya Yojana-National Rural Livelihoods Mission (DAY-NRLM)
3) Pradhan Mantri Jan Dhan Yojana (PMJDY)
4) Mahila E-Haat
Ans: 2
8. What is the objective of the Deen Dayal Antyodaya Yojana?
(SSC Steno, 2022)
1) Helping the poor by providing free food grains. 
2) Helping the poor by providing free house. 
3) Helping the poor by providing skill training. 
4) Helping the poor by providing free food.
Ans: 3 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram