జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) అనేది యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే భారత ప్రభుత్వ కార్యక్రమం. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు తమ పాఠ్యాంశాలతోపాటు సమాజ సేవలో పాల్గొనేలా ప్రోత్సహించడం దీని ఉద్దేశం. వ్యక్తులతో మంచి సంబంధాలను పెంపొందించుకోవడం, సమాజ శ్రేయస్సు పట్ల బాధ్యతగా వ్యవహరించడం లాంటి వాటిపై ఇది దృష్టి సారిస్తుంది. ఎన్‌ఎస్‌ఎస్ అనేది ప్రధానంగా వ్యక్తిత్వ వికాసాన్ని లక్ష్యంగా చేసుకుని మొదలైంది. జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ప్రారంభానికి గుర్తుగా ఏటా సెప్టెంబరు 24న ‘జాతీయ సేవా పథకం’ (National Service Scheme - NSS Day) దినోత్సవాన్ని నిర్వహిస్తారు. విద్యార్థులను దేశసేవలో భాగస్వాములను చేయడం దీని ప్రధాన ఉద్దేశం.
ఎన్ఎస్ఎస్ నినాదం - ‘నేను కాదు, మీరు కూడా’ (NOT ME, BUT YOU).
చారిత్రక నేపథ్యం
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) విద్యా సంస్థల్లోని విద్యార్థులు స్వచ్ఛంద జాతీయ సేవ చేసేలా ప్రోత్సహించాలని కేంద్రానికి సూచించింది. 1958లో నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ యూజీసీ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. దీనిపై ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందించాల్సిందిగా ఆయా రాష్ట్రాల విద్యా మంత్రిత్వ శాఖలను ఆయన కోరారు. మహాత్మా గాంధీ 100వ జయంతిని పురస్కరించుకుని జాతీయ సేవా పథకాన్ని (ఎన్‌ఎస్‌ఎస్) 1969, సెప్టెంబరు 24న నాటి కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ వీకేఆర్‌వీ రావు ప్రారంభించారు. దీని సిద్ధాంతం గాంధీజీ ఆశయాల నుంచి ప్రేరణ పొందింది. జాతీయ సేవా పథకం ఏర్పాటు సూచికగా ఏటా సెప్టెంబరు 24న ఎన్‌ఎస్‌ఎస్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
| ఎన్‌ఎస్‌ఎస్ అవార్డు ఇతర ముఖ్య సమాచారంతోపాటు గతంలో పలు పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సుII’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. విద్యా మంత్రిత్వ శాఖ నేషనల్ సర్వీస్ స్కీంను ఏ సంవత్సరంలో ప్రారంభించింది?
(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ టీజీటీ (సోషల్ సైన్స్), 2025)
1) 1971-72 2) 1969-70
3) 1970-71 4) 1972-73
సమాధానం: 2
2. ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ కార్యకలాపాలను......
(డీఎన్‌ఎస్‌ఎస్‌బీ ఎన్‌డీఎంసీ పీఆర్‌టీ, 2022)
1) ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ప్రోత్సహించాలి
2) ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రమే ప్రోత్సహించాలి
3) ఆర్మీ పాఠశాలల్లో మాత్రమే ప్రోత్సహించాలి
4) అన్ని పాఠశాలల్లో ప్రోత్సహించాలి
సమాధానం: 4
3. జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?
(యూపీపీఎస్సీ జీఐసీ లెక్చరర్ ఎకనామిక్స్, 2017),
(యూపీ పోలీస్ ఎస్‌ఐ, 2021),
1) జూన్ 5 2) సెప్టెంబరు 24
3) సెప్టెంబరు 14 4) జులై 5
సమాధానం: 2
4. నేషనల్ సర్వీస్ స్కీం కింది ఏ మంత్రిత్వ శాఖ అధీనంలో ఉంటుంది?
(ఎంపీ పోలీస్ కానిస్టేబుల్, 2023)
1) రక్షణ మంత్రిత్వ శాఖ
2) హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ
3) యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
4) సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ
సమాధానం: 3
5. "Not me, but you" is the motto of which one of the following youth organizations/schemes?
(NDA-II (GAT), 2024)
1) Rashtriya Yuva Sashaktikaran Karyakram
2) National Service Scheme (NSS)
3) National Young Leaders Programme
4) National Discipline Scheme (NDS)
Ans: 2
6. The National Service Scheme (NSS) Award for the year 2019-20 will be given to how many awardees in 3 different categories in September 2021?
(RPF Constable, 2024)
1) 18 2) 26 3) 38 4) 42 5) 54
Ans: 4