అవసరంలో ఉన్నవారికి వీలైనంత సాయం చేసే గొప్ప గుణమే మానవత్వం. ఎదుటివారికి సాయపడటం, ప్రతిఫలాన్ని ఆశించకపోవడం, హోదాను బట్టి కాక వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవించడం లాంటివన్నీ మానవత్వ చిహ్నాలే. సంక్షోభ సమయాల్లో ఇతరులకు సాయం చేయడానికి ముందుకొచ్చే వారిని గౌరవించే లక్ష్యంతో ఏటా ఆగస్టు 19న ‘ప్రపంచ మానవతా దినోత్సవం’గా (World Humanitarian Day) నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న మానవతా సంక్షోభాల గురించి అవగాహన పెంచడంతోపాటు అవసరంలో ఉన్నవారికి మద్దతు ఇవ్వడానికి చేసే చర్యలను ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
ప్రపంచ మానవతా దినోత్సవాన్ని ఏటా ఆగస్టు 19న జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి 2008, డిసెంబరులో తీర్మానించింది. సంక్షోభ సమయాల్లో ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించే మానవతావాదుల త్యాగాలను గౌరవించే ఉద్దేశంతో ఐరాస ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచ మానవతా దినోత్సవాన్ని మొదటిసారి 2009లో నిర్వహించారు.
| అంతర్జాతీయ మానవతా చట్టం, మానవతా సహాయం - విపత్తు సహాయక చర్యలు, మానవతా కార్యక్రమాలు, భారత్ చేపట్టిన హెచ్‌ఏడీఆర్ మిషన్లు, పాల్గొనే సంస్థలు లాంటి సమాచారంతోపాటు ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, యూజీసీ నెట్, ఎస్‌ఎస్‌సీ తదితర పోటీపరీక్షల్లో ఈ టాపిక్‌పై అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. 2025లో మయన్మార్ భూకంపం సమయంలో భారత్ చేపట్టిన సహాయక చర్యల పేరు?
(ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్, 2026)
1) ఆపరేషన్ సముద్ర సేతు 2) ఆపరేషన్ సహాయత
3) ఆపరేషన్ బ్రహ్మ 4) ఆపరేషన్ మైత్రి
సమాధానం: 3
2. ఐక్యరాజ్యసమితి ప్రపంచ మానవతా సదస్సులో పేర్కొన్న గ్రాండ్ బార్డెన్ కింది దేనికి సంబంధించిన సంస్కరణల హామీలతో వ్యవహరిస్తుంది?
(కేరళ సెట్, 2017)
1) వలస చట్టాలు 2) టీకా కార్యక్రమాలు
3) మానవతా సహాయ నిధుల సమకూర్పు 4) వలసదారులకు ఉపాధి అవకాశాలు
సమాధానం: 3
3. ప్రపంచ మానవతా దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?
(కేవీఎస్ పీఆర్‌టీ, 2017), (బీఎస్‌ఎన్‌ఎల్ జేటీఓ(టీ) ఎల్‌ఐసీఈ, 2018)
(ఎన్‌డీఏ జనరల్ ఎబిలిటీ, 2019), (ఎన్‌డీఏ జనరల్ ఎబిలిటీ, 2017)
1) ఆగస్టు 15 2) ఆగస్టు 19
3) సెప్టెంబరు 19 4) సెప్టెంబరు 15
సమాధానం: 2
4. కిందివాటిలో ఏది మానవతా సంక్షోభాల పరిధిలోకి రాదు?
(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ టైర్ 2, 2022)
1) భూకంపాలు, వరదలు 2) అంతర్యుద్ధం
3) హింస, వేధింపులు 4) సాయుధ ఘర్షణలు
సమాధానం: 1
5. According to the 2025 Financial Tracking Services report by the United Nations Office for the Coordination of Humanitarian Affairs, which two contributors ranked higher than UAE in global humanitarian aid?
(RRB NTPC (Graduate) CBT-I, 2026)
1) Morocco and Denmark 2) United States and European Union
3) India and United Kingdom 4) China and Japan
Ans: 2
6. With which country did India conduct the joint Humanitarian Assistance and Disaster Relief (HADR) exercise in May 2025?
(RRB Group D, 2025)
1) The Philippines 2) The Maldives 3) Sri Lanka 4) Japan
Ans: 2
7. The Indian Army conducted which of the following Multilateral Annual Joint Humanitarian Assistance and Disaster Relief (HADR) Exercises at Ahmedabad and Porbandar in November 2024?
(RPF Constable, 2025)
1) Operation Vijay 2024 2) Operation Kaveri
3) Operation Karuna 4) Sanyukt Vimochan 2024
Ans: 4
8. In response to Cyclone Ditwah in 2025, India expanded which humanitarian mission to deliver aid to Sri Lanka by deploying additional Indian Navy warships?
(RRB NTPC (Graduate) CBT-I, 2026)
1) Operation Samudra Setu 2) Operation Sagar Bandhu
3) Operation Maitri 4) Operation Vanila
Ans: 2