ప్రపంచ రక్త దాతల దినోత్సవం

ప్రపంచ రక్త దాతల దినోత్సవం

మానవ జీవక్రియలో రక్తం ముఖ్య భూమిక పోషిస్తుంది. శరీరానికి పోషకాలను అందించడంతోపాటు, దేహంలోని మలినాలను బయటకు పంపడంలో ఇది కీయాలు, శస్త్రలకంగా పనిచేస్తుంది. గాచికిత్స సమయంలో అధిక రక్తస్రావం జరిగి రక్తహీనతతో బాధపడుతున్నప్పుడు, తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తమార్పిడి అవసరమవుతుంది. రక్తంలో వేర్వేరు యాంటిజన్లు, యాంటీబాడీలు ఉంటాయి. రక్తమార్పిడి సమయంలో వీటిని పరిగణనలోకి తీసుకుని వ్యక్తికి సరైన రక్త గ్రూప్‌ను మాత్రమే ఇవ్వాలి. అలాకాకపోతే రెండు రక్తవర్గాల మధ్య గుచ్ఛీకరణ (Agglutination) జరిగి వ్యక్తి మరణించే ప్రమాదం ఉంది. తెలియని వ్యక్తుల కోసం తమ రక్తాన్ని దానం చేసే వారిని గౌరవించి, వారికి కృతజ్ఞతలు తెలిపే ఉద్దేశంతో ఏటా జూన్‌ 14న ‘ప్రపంచ రక్త దాతల దినోత్సవం’గా (World Blood Donor Day) నిర్వహిస్తారు. అంతేకాదు ఈ రోజు రక్త వర్గాలను కనుక్కున్న శాస్త్రవేత్త లాండ్‌ స్టీనర్‌ జయంతి కూడా.

రక్తం గురించి..

శరీరంలోని ద్రవరూప కణజాలం రక్తం. ఇది జీర్ణమైన ఆహారాన్ని చిన్న పేగు నుంచి శరీరంలోని ఇతర భాగాలకు రవాణా చేస్తుంది; ఊపిరితిత్తుల నుంచి శరీర కణాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది; అలాగే శరీరం నుంచి తొలగించాల్సిన వ్యర్థాలను మూత్రపిండాలకు చేరవేస్తుంది. అందుకే దీన్ని ‘రివర్‌ ఆఫ్‌ ది లైఫ్‌’ అంటారు.

భాగాలు..

రక్తంలో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్స్, ప్లాస్మా అనే భాగాలు ఉంటాయి.

ఎర్ర రక్తకణాలు: వీటినే ఎరిథ్రోసైట్‌లు అంటారు. ఇవి గుండ్రంగా లేదా ద్విపుటాకారంగా ఉంటాయి. వీటికి కేంద్రకం ఉండదు. శరీరంలో కేంద్రకం లేని కణాలు ఇవే.

ఎర్రరక్తకణాల లోపల హిమోగ్లోబిన్‌ ఉంటుంది. రక్తం ఎరుపు రంగులో ఉండటానికి ఇదే కారణం.

తెల్ల రక్తకణాలు: వీటిని ల్యూకోసైట్‌లు, శరీర రక్షక భటులు అనే పేర్లతో పిలుస్తారు. నిర్ణీత ఆకారం ఉండదు. కేంద్రకం ఉంటుంది. శరీరాన్ని వివిధ సూక్ష్మజీవుల బారి నుంచి రక్షించి వ్యాధి నిరోధకత కలిగిస్తాయి. ఇవి ఒక క్యూబిక్‌ మిల్లీమీటర్‌కు 5,000 నుంచి 10,000 వరకు ఉంటాయి. తెల్లరక్త కణాలు ఎముక మజ్జలో ఉత్పత్తి అవుతాయి.

ప్లేట్‌లెట్స్‌: వీటిని థ్రాంబోసైట్స్‌ అని కూడా ఉంటారు. పూర్తి కణాలు కావు. కేంద్రకం ఉండదు. రక్తకణాలన్నింటిలో చిన్నవి. ఎముక మజ్జలోని మెగాకారియోసైట్‌ల నుంచి ఇవి ఉద్భవిస్తాయి.

ప్లాస్మా: రక్తంలో రక్తకణాల మధ్య ఉండే లేత పసుపు పచ్చ ద్రవాన్ని ప్లాస్మా అంటారు. ఇది మొత్తం రక్తంలో 55 శాతం ఉంటుంది. ప్లాస్మాలో 90-92 శాతం నీరు ఉంటుంది.

రక్త వర్గాలు - రక్త మార్పిడి

రక్తమార్పిడిలో రెండు రకాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ రెండింటిని సరిపోల్చి ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి రక్తమార్పిడి చేస్తారు. అవి:

ఏ, బీ, ఏబీ, ఓ రక్తవర్గాలు. 2. ఆర్‌హెచ్‌ రకం రక్తవర్గం.

చారిత్రక నేపథ్యం:

ఆస్టియ్రాకు చెందిన జీవశాస్త్రవేత్త కార్ల్‌ లాండ్‌ స్టీనర్‌ 1901లో మానవుల్లో ప్రధాన రక్త గ్రూపులైన ఏ, బీ, ఓ లను కనుక్కున్నారు. తర్వాత 1902లో ఈయన సహచరులైన అల్ఫెడ్ర్‌ డెకాస్టెల్లో, అడ్రియానో స్టర్లి ఏబీ రక్తవర్గాన్ని గుర్తించారు. లాండ్‌ స్టీనర్‌ పరిశోధనల ఫలితంగానే మానవుల్లో సురక్షిత రక్త మార్పిడికి అవకాశం ఏర్పడింది. ఈయన 1868, జూన్‌ 14న జన్మించారు. ఈ రోజును ‘ప్రపంచ రక్త దాతల దినోత్సవం’గా జరుపుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) 2004లో తీర్మానించింది.

2026 నినాదం: One Drop of Humanity. Give Blood. Save Lives.

రక్త వర్గాలు - రక్త మార్పిడి, అరుదైన రక్తవర్గాలు, కార్ల్‌ లాండ్‌ స్టీనర్, ఇతర విశేషాలతోపాటు యూపీఎస్సీ, యూజీసీ నెట్, రైల్వే, ఇతర పోటీ పరీక్షల్లో అడిగిన 150కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ప్రపంచ రక్త దాతల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?

(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2021)(హెచ్‌పీ టీజీటీ (ఆర్ట్స్‌) టెట్, 2018)

1) జూన్‌ 10 2) జూన్‌ 14

3) జూన్‌ 12 4) జూన్‌ 16

సమాధానం: 2

2. ఒక సాధారణ వయోజన మానవుడి శరీరంలో ఉండే మొత్తం రక్తం పరిమాణం ఎంత?

(బీపీఎస్సీ 2015)

1) 5 - 6 లీటర్లు 2) 3 - 4 లీటర్లు

3) 8 - 10 లీటర్లు 4) 10 - 12 లీటర్లు

సమాధానం: 1

3. కింది దేని కారణంగా రక్తం ఎరుపు రంగులో ఉంటుంది?

(ఎంపీ పోలీస్‌ కానిస్టేబుల్, 2022)

1) సైటోక్రోమ్‌ 2) క్లోరోఫిల్‌

3) హీమోసయనిన్‌ 4) హిమోగ్లోబిన్‌

సమాధానం: 4

4. White blood cells are also known as:

(ACC 122 CGAT Paper 2020)

1) Thrombocytes 2) Erythocytes 3) Leukocytes 4) Platelets

Ans: 3

5. What is the main purpose of the circulatory system?

(OSSSC LSI, Forester & Forest Guard Official Paper 2024)

1) Respiration 2) Digestion

3) Excretion 4) Transportation of substances

Ans: 4

6. What is the function of plasma in human blood?

(RRB Group D Official Paper 2025)

1) It carries oxygen from lungs to all parts of the body.

2) It maintains the oxygennrich blood supply to tissues.

3) It transports food, carbon dioxide and waste materials.

4) It helps in clotting blood during injuries.

Ans: 3

7. Life span of red blood cells is___ days.

(WBCS Prelims 2018)

1) 60 2) 120 3) 180 4) 240

Ans: 2 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram