ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం

ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం

సాంఘిక, ఆర్థిక కారణాల వల్ల కొంతమంది బాలలు కార్మికులుగా మారుతున్నారు. పిల్లలను బాల కార్మిక వ్యవస్థ నుంచి కాపాడే లక్ష్యంతో ఏటా జూన్‌ 12న ‘ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం’గా(World Day Against Child Labour) నిర్వహిస్తారు. బాల కార్మిక వ్యవస్థ వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలతోపాటు పరిశ్రమలు, సంస్థల యాజమాన్యాలను చైతన్యపరచడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

బాలకార్మిక వ్యవస్థ అంటే?

  • ‘‘పిల్లల బాల్యాన్ని, సామర్థ్యాన్ని, గౌరవాన్ని హరించి; వారి శారీరక, మానసిక వికాసానికి హాని కలిగించే పనే బాలకార్మిక వ్యవస్థ’’ - ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎల్‌ఓ)
  • ‘‘18 ఏళ్లలోపున్న పనిచేసేవారు బాల కార్మికులు’’ - ఐక్యరాజ్య సమితి.
  • మన దేశంలో 14 సంవత్సరాలలోపు పనిచేసే పిల్లలను బాల కార్మికులుగా వ్యవహరిస్తారు. బాలకార్మిక వ్యవస్థ అనేది పిల్లలకు విద్యను, గౌరవాన్ని దూరం చేస్తుంది. చిన్నారులు పాఠశాలకు వెళ్లకుండా అడ్డుకునే ఏ పనైనా బాల కార్మిక వ్యవస్థ కిందికే వస్తుంది. ఇది మూడు రకాలుగా ఉంటుంది.

1. పిల్లలు పాఠశాలకు వెళ్లకుండా అడ్డుకునే పనులు.

2. పాఠశాల మధ్యలోనే చదువు మానేసేలా చేసే పనులు.

3. పాఠశాలకు వెళ్తున్నప్పటికీ అధిక పనిభారాన్ని మోపే పనులు. 

బాలకార్మిక రంగంలోని మొత్తం పిల్లల్లో దాదాపు మూడింట రెండు వంతులు 

(87 మిలియన్లు) సబ్‌ సహారా ఆఫ్రికాలలోనే ఉన్నారు. ఆ ప్రాంతంలోని తీవ్ర పేదరికం, సామాజిక నేపథ్యం దీనికి కారణాలు. 2020 నుంచి ఆసియా, పసిఫిక్‌ ప్రాంతంలో ఈ రంగంలో గణనీయమైన తగ్గుదల నమోదైంది. 2025 నాటికి ఈ సంఖ్య 49 మిలియన్ల నుంచి 28 మిలియన్లకు చేరింది.

చారిత్రక నేపథ్యం

బాల కార్మికుల సమస్యలపై దృష్టి సారించడంతోపాటు ఆ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించే ఉద్దేశంతో అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) 2022, జూన్‌ 11న ఒక సమావేశాన్ని నిర్వహించింది. అందులో 14 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలను ప్రమాదకర వాతావరణంలో పనిచేయించడాన్ని చట్టపరంగా నేరంగా ప్రకటించాలని సభ్యదేశాలు తీర్మానించాయి. దీన్ని వ్యాప్తి చేసేందుకు ఒక రోజును జరపాలని నిశ్చయించాయి. ఆ విధంగా వచ్చిందే ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం.   

బాలకార్మిక వ్యవస్థ రూపాలు, దాని కిందికి రాని పనులు, ప్రపంచవ్యాప్త గణాంకాలు, భారతదేశంలో తీరుతెన్నులు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనుకు అంతర్జాతీయ కన్వెన్షన్స్, మన దేశంలో బాలకార్మిక వ్యవస్థను నిషేధించే రాజ్యాంగ నిబంధనలతో సహా ఎస్‌ఎస్‌సీ, యూపీఎస్సీ సివిల్స్, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ తదితర పోటీపరీక్షల్లో అడిగిన 100కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. భారత రాజ్యాంగం ఎన్ని సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారిని పనిలో నియమించడాన్ని నిషేధించింది?

(ఆర్‌పీఎఫ్, 2019)

1) 14   2) 7   3) 16   4) 18

సమాధానం: 1

2. ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎల్‌ఓ) కన్వెన్షన్లు అయిన 138, 182 దేనికి సంబంధించినవి?

(ఒడిశా పోలీస్‌ ఎస్‌ఐ, 2022)

1) ప్రపంచ వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ పద్ధతులు మార్చుకోవడం

2) ఆహార ధరల నియంత్రణ, ఆహార భద్రత

3) బాలకార్మిక వ్యవస్థ

4) పని ప్రదేశంలో లింగ సమానత్వం

సమాధానం: 3

3. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?

(రాజస్థాన్‌ గ్రేడ్‌ 3 (భిల్వారా) - సోషల్‌స్టడీస్, 2012),(బిహార్‌ సీఈటీ బీఈడీ, 2018)

1) మే 1      2) ఏప్రిల్‌ 30

3) జూన్‌ 12   4) మార్చి 8

సమాధానం: 3

4. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21ఎ దేనికి సంబంధించింది?

(కేరళ ఎస్‌ఈటీ, 2016)

1) బాలకార్మిక వ్యవస్థ నిషేధం        2) విద్యాహక్కు

3) దివ్యాంగుల చట్టం                4) బాలల హక్కులు

సమాధానం: 2

5. Article 21A, making education a Fundamental Right, was inserted by which amendment?
(SSC CGL 2025)
1) 42nd Amendment            2) 86th Amendment
3) 93rd Amendment            4) 44th Amendment
Ans: 2
6. In which of the following years, was Article 21-A inserted in the Constitution of India, which deals with the Fundamental Right of getting compulsory education for all children in the age group of six to fourteen years?
(RRB Group D 2022)
1) 2003        2) 2004        3) 2001        4) 2002
Ans: 4

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram