వినియోగదారులు, వ్యాపారాలు, నియంత్రణ సంస్థల్లో నమ్మకం, విశ్వాసాన్ని పెంపొందించడంలో ‘అక్రిడిటేషన్’ కీలకపాత్ర పోషిస్తుంది. ఉత్పత్తులు, సేవలు, వ్యవస్థలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లు హామీ ఇవ్వడం ద్వారా ఇది జరుగుతుంది. వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థలో అక్రిడిటేషన్ పాత్రను గుర్తించే లక్ష్యంతో ఏటా జూన్ 9న ‘వరల్డ్ అక్రిడిటేషన్ డే’గా (World Accreditation Day) నిర్వహిస్తారు. అక్రిడిటేషన్ విలువలు, ప్రయోజనాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
అక్రిడిటేషన్ అంటే?
అక్రిడిటేషన్ అనేది ఒక నాణ్యతా తనిఖీ ప్రక్రియ. ఇందులో ఆయా సంస్థలు ప్రభుత్వాలు నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నాయని అధికారికంగా ధ్రువీకరించడం జరుగుతుంది. ఉదాహరణకు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, విద్యా సంస్థలు, ప్రయోగశాలలు, ధృవీకరణ సంస్థలు మొదలైన వాటి సామర్థ్యం, విశ్వసనీయతను నిర్ధారించడాన్ని అక్రిడిటేషన్ అంటారు.
ప్రయోజనాలు
భారతదేశంలో అక్రిడిటేషన్
క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) అనే అత్యున్నత సంస్థ మన దేశంలో అక్రిడిటేషన్ వ్యవస్థను స్థాపించడానికి, నిర్వహించడానికి బాధ్యత వహిస్తోంది. దీన్ని 1996లో నెలకొల్పారు. భారత ప్రభుత్వం, దేశంలోని ప్రముఖ పారిశ్రామిక సంఘాల మధ్య ఒక ప్రత్యేక ప్రభుత్వ - ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా క్యూసీఐ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
చారిత్రక నేపథ్యం
వస్తు, సేవల స్థాయిని నిర్ధారించే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ ల్యాబొరేటరీ అక్రిడిటేషన్ కోఆపరేషన్ (ఐఎల్‌ఏసీ) మ్యూచువల్ రికగ్నిషన్ అరేంజ్‌మెంట్ (ఎంఆర్‌ఏ)ను తెచ్చింది. దీన్ని 1994, జూన్ 9న సభ్యదేశాలు ఆమోదించాయి. 2007లో జరిగిన ఇంటర్నేషనల్ ల్యాబొరేటరీ అక్రిడిటేషన్ కోఆపరేషన్ (ఐఎల్‌ఏసీ), ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ ఫోరం (ఐఏఎఫ్) ఉమ్మడి సమావేశంలో ఏటా జూన్ 9న ‘వరల్డ్ అక్రిడిటేషన్ డే’గా నిర్వహించాలని తీర్మానించాయి. 2008 నుంచి ఏటా దీన్ని జరుపుతున్నారు.
|
క్యూసీఐ - అయిదు ప్రధాన అనుబంధ బోర్డులు, వాటి పనితీరు, భారతదేశంలో వృత్తి - విద్యా నైపుణ్యాలు, సర్టిఫికేషన్ సహా వివిధ రంగాలకు గుర్తింపు ఇచ్చే ముఖ్యమైన సంస్థలు తదితర సమాచారంతోపాటు ఎస్‌ఎస్‌సీ, యూజీసీ నెట్, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ లాంటి పోటీపరీక్షల్లో అడిగిన 50కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (ఎన్‌ఏఏసీ)ను 1994లో కింది ఏది స్థాపించింది?
(ఎంపీఎస్‌ఈటీ 2023)
1) యూజీసీ 2) ఏఐసీటీఈ
3) ఎన్‌సీఈఆర్‌టీ 4) డీఈసీ
సమాధానం: 1
2. కిందివాటిలో నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్‌బీఏ)ను ఏర్పాటు చేసింది?
(యూజీసీ నెట్, 2022)
1) యూజీసీ 2) ఏఐసీటీఈ
3) డీఈబీ 4) ఎన్‌ఏఏసీ
సమాధానం: 2
3. ‘వరల్డ్ అక్రిడిటేషన్ డే’ను ఏ రోజున నిర్వహిస్తారు?
(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్, 2023)
1) జూన్ 19 2) జూన్ 7 3) జూన్ 6 4) జూన్ 9
సమాధానం: 4
4. అక్రిడిటేషన్ (గుర్తింపు ప్రక్రియ) అనేది కిందివాటిలో దేన్ని సూచిస్తుంది?
(జీఎస్‌ఎస్‌ఎస్‌బీ నర్సింగ్ ట్యూటర్, 2022)
1) అంచనాలు వేయడం
2) ముందుగా నిర్ణయించిన ప్రమాణాలు అందుకోవడం
3) సంరక్షణను తక్కువ ఖర్చుతో కూడినదిగా చేయడం
4) నాణ్యతను నిర్ధారించడం
సమాధానం: 2
5. The Sixth Five-Year Plan (1980 - 85) prioritized:
(MP Police ASI & Subedar Steno Official Paper 2025)
1) Technological modernization and employment generation
2) Export promotion
3) Import substitution only
4) Banking liberalization
Ans: 1
4. In Indian University System, the popular body for accreditation is
(DSSSB Librarian 2019)
1) NBA 2) NAAC 3) NIRF 4) None of the above
Ans: 2