తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

  • అనేక పోరాటాలు, త్యాగాల ఫలితంగా దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ 2014, జూన్‌ 2న 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. ఆరు దశాబ్దాలకుపైగా జరిగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాల్లో ఎందరో భాగస్వాములయ్యారు. ఈ పోరాటంలో మొదటి నుంచి అంటే 1952లో, తర్వాత 1969లో, మళ్లీ 1980, 1990
  • దశకాల్లో, 2001-2014 మధ్య మలిదశ ఉద్యమకాలంలో మేధావులు, విద్యార్థులు కీలకంగా వ్యవహరించారు. పోటీ పరీక్షల నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన ముఖ్యాంశాలను తెలుసుకుందాం..!

ఇదీ తెలంగాణ చరిత్ర

  • హైదరాబాద్‌ సంస్థానంలో భాగంగా ఉన్న తెలంగాణ క్రీ.పూ.6వ శతాబ్దంలో విలసిల్లిన షోడశ మహాజనపదాల్లో ఒకటిగా ఉండేది. పురాణాల్లో పేర్కొన్న దక్షిణాపథం, తైలింగులు, త్రిలింగదేశం మొదలైనవన్నీ తెలంగాణను సూచిస్తున్నాయి. క్రీ.పూ.నాలుగో శతాబ్దం నాటి వాయు, మార్కండేయ పురాణాల్లో త్రిలింగ/ తిలింగ దేశంగా తెలంగాణ గురించి మొదటి సాహిత్య ప్రస్తావన ఉంది.
  • తెల్లాపూర్‌లో లభించిన శిలాశాసనంలో ఆ ప్రదేశాన్ని తెలంగాణపురం (తెలుంగణపురం) అని రాశారు. ఇది సుమారు క్రీ.శ.1417లో బహమనీ సుల్తాన్‌ ఫిరోజ్‌ షా కాలం నాటి శాసనం. ఇది తెలంగాణకు సంబంధించి తొలి అధికారిక శిలాశాసనంగా గుర్తింపు పొందింది. 1510లో సూర్యవంశ గజపతి రాజవంశానికి చెందిన ప్రతాపరుద్ర గజపతి వేయించిన వెలిచర్ల శాసనంలో ‘తెలంగాణ దుర్గాలు (కోటలు)’ గురించి ఉంది.  

కొత్తగా రాష్ట్రం ఏర్పాటు కావాలంటే?

  • భారత రాజ్యాంగంలోని 3వ అధికరణ కొత్త రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల పునర్విభజన, రాష్ట్రాల సరిహద్దుల మార్పు, రాష్ట్రాల పేర్ల మార్పులకు సంబంధించిన ప్రక్రియను సూచిస్తుంది. ఈ విషయంలో పార్లమెంట్‌కి ఉన్న విశిష్ట అధికారాన్ని పేర్కొంటుంది. ఇందుకు సంబంధించిన బిల్లును రాష్ట్రపతి ముందస్తు అనుమతితో పార్లమెంటు ఉభయసభల్లో ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు.
  • రాష్ట్రపతి ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి ముందు సంబంధిత రాష్ట్ర శాసనసభ అభిప్రాయం కోసం పంపాలి. నిర్ణీత గడువులోపు అభిప్రాయాన్ని తెలియజేయకపోయినా లేదా బిల్లును తిరస్కరించినా రాష్ట్ర శాసనసభ దాన్ని ఆమోదించినట్లుగానే రాష్ట్రపతి భావించవచ్చు. ఎందుకంటే ఇది అభిప్రాయాన్ని తెలియజేయాలని పేర్కొంటోందే తప్ప ఆమోదించాలని నిర్దేశించడం లేదు.
తెలంగాణ ఉద్యమం - ముఖ్య సంఘటనల క్రమం, ఇతర విశేషాలతోపాటు తెలంగాణ పోలీస్, రైల్వే, ఇతర పోటీ పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ 'ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. తెలంగాణ ప్రాంతం గతంలో కింది ఏ రాష్ట్రంలో భాగంగా ఉంది?
(సీటీఈటీ (సాంఘికశాస్త్రం), 2021)

1) మహారాష్ట్ర          2) ఆంధ్రప్రదేశ్‌

3) మధ్యప్రదేశ్‌         4) కర్ణాటక

సమాధానం: 2

2. తెలంగాణ రాష్ట్రం ఏ సంవత్సరంలో ఏర్పాటైంది?
(పశ్చిమ్‌ బెంగాల్‌ గ్రూప్‌ సి, 2016),(ఎంపీపీఈబీ గ్రూప్‌ 2 లేబర్‌ ఇన్‌స్పెక్టర్, 2017),(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్, 2020)

1) 2015      2) 2014        3) 2018     4) 2012

సమాధానం: 2

3. తెలంగాణ రాష్ట్రం అనేది ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం, ...... ప్రకారం ఏర్పాటైంది?

1) 2015     2) 2014      3) 2012    4) 2016

సమాధానం: 2 

4. తెలంగాణ ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటోంది?
(ఎన్‌డీఏ, 2015)

1) 5    2) 4    3) 6    4) 3

సమాధానం: 2

5. Telengana was carved out of which state?
(J & K Police Constable, 2016)

1) Andhra Pradesh        2) Bihar

3) Karnataka            4) Tamil Nadu

Ans: 1

6. The formation of separate Telangana state was the result of Telangana people's long fight to get the following :
(Telangana Police SI Mains Exam 2018)

1) Water, Resources, Jobs

2) Education, Employment, Independence

3) Respect, Huge Wealth, Influence

4) Reservations, Jobs, Bank loans

Ans: 1

7. After India’s 29th state, Telangana, was created, which of the following parties formed the first government in the state?
(RRC Group D, 2018)

1) Telangana Rashtra Samithi (TRS)

2) Telangana Rajya Samithi (TRS)

3) Telangana Loka Samithi (TLS)

4) Telangana Maha Samithi (TMS)

Ans: 1

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram