గ్రామీణ ప్రాంతాల పాలనకు ఉద్దేశించిన స్థానిక సంస్థలను పంచాయతీరాజ్ వ్యవస్థగా పేర్కొంటారు. ఇది గ్రామీణ స్వయం పాలనకు పునాది. పల్లెలను శక్తిమంతం చేయడంలో, సమ్మిళిత పాలనను ప్రోత్సహించడంలో ఈ వ్యవస్థ కీలకంగా పనిచేస్తుంది. అధికార వికేంద్రీకరణకు, క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్య భాగస్వామ్యానికి భారత్ కట్టుబడి ఉందనడానికి ఇది నిదర్శనం. స్థానిక పాలనా వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడంలో పంచాయతీ రాజ్ సంస్థల పాత్రను గుర్తించే లక్ష్యంతో మన దేశంలో ఏటా ఏప్రిల్ 24న ‘జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం’గా (National Panchayati Raj Day) నిర్వహిస్తారు. గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహించడంలో, సామాజిక సాధికారతలో వీటి భూమికను ప్రజలకు తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
ముఖ్యాంశాలు..
మన దేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లో ఉంది.
1. దిగువ స్థాయి - గ్రామ పంచాయతీ
2. మధ్య/ బ్లాక్ స్థాయి - పంచాయతీ సమితి
3. ఉన్నత స్థాయి - జిల్లా పరిషత్.
చారిత్రక నేపథ్యం:
పీవీ నరసింహారావు ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ భద్రత కల్పించే లక్ష్యంతో 73వ రాజ్యాంగ సవరణ బిల్లును 1991, సెప్టెంబరు 16న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. 1992, డిసెంబరు 22న దీనికి ఆమోదం లభించింది. ఈ బిల్లుకు దేశంలోని 17 రాష్ట్రాల శాసనసభలు అంగీకారం తెలిపాయి. ఈ బిల్లుపై అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ 1993, ఏప్రిల్ 20న ఆమోదముద్ర వేయడంతో 73వ రాజ్యాంగ సవరణ, చట్టం (1992)గా మారి 1993, ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది.
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు..
1. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?
(ఎంపీ పట్వారీ, 2017), (ఎన్‌టీపీసీ, 2021), (ఉత్తరాఖండ్ పట్వారీ, 2023),
(ఎంపీ పోలీస్ ఎస్‌ఐ, 2017), (రాజస్థాన్ పీటెట్, 2020),
(యూకేఎస్‌ఎస్‌ఎస్‌సీ ఫారెస్ట్ గార్డ్, 2020), (యూపీపీఎస్సీ సివిల్ సర్వీస్, 2019),
(మద్రాస్ హైకోర్ట్, 2022)
1) ఏప్రిల్ 24 3) జూన్ 2
3) సెప్టెంబరు 20 4) డిసెంబరు 19
సమాధానం: 1
2. భారతదేశం ఏ పంచాయతీరాజ్ వ్యవస్థను కలిగి ఉంది?
(డబ్ల్యూబీసీఎస్ ప్రిలిమ్స్, 2019)
1) ఒక అంచె 2) రెండు అంచెలు
3) మూడు అంచెలు 4) నాలుగు అంచెలు
సమాధానం: 3
3. Consider the following statements:
I. Panchayats at the intermediate level exist in all States.
II. To be eligible to be a Member of a Panchayat at the intermediate level, a person should attain the age of thirty years.
III. The Chief Minister of a State constitutes a commission to review the financial position of Panchayats at the intermediate levels and to make recommendations regarding the distribution of net proceeds of taxes and duties, leviable by the State, between the State and Panchayats at the intermediate level.
Which of the statements given above are not correct?
(UPSC Prelims 2025)
1) I and II only 2) II and III only
3) I and III only 4) I, II and III
Ans: 4
4. Where was the National Panchayati Raj Day 2025 event organised?
(71th BPSC Exam 2025)
1. Patna 2. Madhubani
3. Gaya 4. More than one of the above
Ans: 2