విశ్వంలో జీవులు మనగలిగే ఏకైక గ్రహం భూమి. ప్రాణికోటి తమ మనుగడకు కావాల్సిన ప్రాథమిక వనరులన్నింటినీ ప్రకృతిలోని సహజ పర్యావరణం నుంచే పొందుతోంది. అయితే జనాభా పెరుగుదల, వాతావరణ మార్పులు, సహజ - మానవకారక విపత్తులు, అటవీ నిర్మూలన, కాలుష్యం మొదలైన కారణాల వల్ల భూమి తన సహజత్వాన్ని కోల్పోతోంది. దీని వల్ల నేల నాణ్యత క్షీణించి, పంటలు పండించడం కష్టమవుతుంది. ఇవన్నీ ఆహార భద్రతతోపాటు జీవుల ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి. భూమిని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా ఏప్రిల్ 22న ‘అంతర్జాతీయ మాతృభూమి దినోత్సవం’గా (International Mother Earth Day) నిర్వహిస్తారు. దీన్నే ‘వరల్డ్ ఎర్త్ డే’ అనే పేరుతోనూ పిలుస్తారు. భూమి - దాని ఆవరణ వ్యవస్థలు మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి; ప్రజల జీవనోపాధిని మెరుగుపరుచుకోవడం, జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడంలో పర్యావరణ ఆవశ్యకతను తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
ముఖ్యాంశాలు..
భూగోళానికి హాని కలిగించే ప్రధాన కాలుష్య కారకాలు..
వాయు కాలుష్యం: వాతావరణంలోకి హానికర వాయువులు, పొగ, కణాలు విడుదలవడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతుంది.
జల కాలుష్యం: నదులు, సరస్సులు, భూగర్భ జలాలు హానికర పదార్థాలతో కలుషితమైనప్పుడు జల కాలుష్యం ఏర్పడుతుంది.
నేల కాలుష్యం: రసాయనాలు, పురుగుమందులు, భార లోహాలు, పారిశ్రామిక వ్యర్థాల ద్వారా భూమి కలుషితమవడంతో నేల కాలుష్యం ఏర్పడుతుంది.
శబ్ద కాలుష్యం: అధిక లేదా హానికర ధ్వనుల వల్ల శబ్ద కాలుష్యం ఏర్పడుతుంది. ఇది మానవులు, వన్యప్రాణులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ఉష్ణ కాలుష్యం: మానవ కార్యకలాపాల ఫలితంగా నీటి ఉష్ణోగ్రతలో ఆకస్మిక పెరుగుదల లేదా తగ్గుదల సంభవించడాన్ని ఉష్ణ కాలుష్యంగా పేర్కొంటారు.
న్యూక్లియర్/ రేడియేషన్ కాలుష్యం: రేడియోధార్మిక పదార్థాల కారణంగా గాలి, నీరు, భూమి కలుషితమవడం.
సముద్ర కాలుష్యం: హానికర పదార్థాలు మహాసముద్రాలు, సముద్రాల్లోకి చేరడం వల్ల సంభవిస్తుంది.
ప్లాస్టిక్ కాలుష్యం: భూమి, జలావరణంలో విచ్ఛిన్నం కాని ప్లాస్టిక్ పేరుకుపోవడం వల్ల సంభవిస్తుంది.
కాంతి కాలుష్యం: సహజంగా ఉండే చీకటికి అంతరాయం కలిగించే అధిక కృత్రిమ కాంతి వల్ల కాంతి కాలుష్యం ఏర్పడుతుంది.
చారిత్రక నేపథ్యం
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. అంతర్జాతీయ మాతృభూమి దినోత్సవాన్ని ఏటా కింది ఏ తేదీన నిర్వహిస్తారు?(ఎంపీ పట్వారీ, 2017), (ఆర్‌ఆర్‌బీ ఏఎల్‌పీ, 2024),(ఎంపీ పోలీస్ కానిస్టేబుల్, 2023), (హెచ్‌పీ టీజీటీ (మెడికల్) టెట్, 2021),(వెస్ట్ బెంగాల్ గ్రూప్ సి, 2017), (డబ్ల్యూబీసీఎస్ మెయిన్స్, 2022), (ఎంపీ ఎక్సైజ్ కానిస్టేబుల్, 2023), (బిహార్ పోలీస్ ఎస్‌ఐ, 2023), (ఓఎస్‌ఎస్‌సీ సీజీఎల్, 2022),
1) ఏప్రిల్ 22 2) ఏప్రిల్ 23 3) ఏప్రిల్ 21 4) ఏప్రిల్ 24
సమాధానం: 1
2. కిందివాటిలో రేడియోధార్మిక కాలుష్యానికి మూలం?(యూపీఎస్‌ఎస్‌ఎస్‌సీ జేఈ సివిల్, 2016)
1) ఇంధనం 2) వైద్యపరమైన వినియోగం
3) శీతలీకరణి 4) ఏదీకాదు
సమాధానం: 4
3. The theme for International Mother Earth Day, 2021 was ‘________’. (SSC CGL 2021)
1. Climate Action 2. Restore our Earth
3. End Plastic Pollution 4. Protect our Species
Answer: 2
4. Which of the following is/are used as disinfectant of water?(UPPSC Civil Service 2016)
1. Ozone 2. Chlorine dioxide
3. Chloramine 4. All of the above
Answer: 4
5. Point sources of water pollution are :
(A) Underground coal mines
(B) Run-off from farm fields
(C) Sewage treatment plants
(D) Run-off from roads and construction sites
(E) Power plants
Choose the correct answer from the options given below :
(UGC NET 2021)
1. (C), (E) only 2. (A), (C), (E) only
3. (A), (C), (D), (E) only 4. (B), (C), (E) only
Answer: 2