జాతీయ పౌర సేవల దినోత్సవం

జాతీయ పౌర సేవల దినోత్సవం

ప్రజాస్వామ్యంలో పాలన, విధాన రూపకల్పన - అమలుతోపాటు దేశాన్ని పురోగతి, అభివృద్ధి వైపు నడిపించడంలో పౌర సేవలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. వీటిని ముందుకు తీసుకెళ్లే వ్యక్తులే సివిల్‌ సర్వెంట్స్‌ (పౌర సేవకులు). ప్రభుత్వాలు తీసుకునే విధానపరమైన నిర్ణయాలను ఆచరణలో పెట్టడంలో; పథకాలు, సేవలు పౌరులకు చేరువ చేయడంలో వీరు కీలకం. ప్రజాపాలనలో సివిల్‌ సర్వెంట్స్‌ చేసే అవిశ్రాంత కృషికి గుర్తుగా మన దేశంలో ఏటా ఏప్రిల్‌ 21న ‘పౌర సేవల దినోత్సవం’గా (National Civil Services Day) నిర్వహిస్తారు. దేశ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో వారి పాత్ర గురించి ప్రజలందరికీ తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

పౌర సేవలు అంటే?

  • ప్రజాస్వామ్యంలో అధికారం ప్రజల చేతిలో ఉంటుంది. ఇందులో వారు తమకు నచ్చిన వ్యక్తులను పాలకులుగా ఎన్నుకుంటారు. ప్రజాస్వామ్యానికి మూడు మూల స్తంభాలు ఉన్నాయి. అవి: 1. శాసనసభ (Legislature)  2. కార్యనిర్వాహక వర్గం (Executive)  3. న్యాయవ్యవస్థ (Judiciary)
  • పౌర సేవలు అనేవి కార్యనిర్వాహక వర్గంలో భాగం. ఇందులోని ప్రజా ప్రతినిధులు ఎన్నికల ద్వారా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారు. వీరు తాత్కాలికమైనవారు. అయితే పౌర సేవకులు కార్యనిర్వాహక వర్గంలో శాశ్వత భాగంగా ఉంటారు
  • వీరు ప్రభుత్వంలోని మంత్రులు, వ్యక్తులకు జవాబుదారీగా ఉంటారు. ప్రభుత్వ విధానాల రూపకల్పన, నిర్ణయాల అమలుకు బాధ్యత వహిస్తారు
  • ప్రస్తుతం భారత్‌లో మూడు రకాల పౌర సేవలు ఉన్నాయి. అవి: ఆల్‌ ఇండియా సర్వీసెస్, సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్, స్టేట్‌ సివిల్‌ సర్వీసెస్‌.

భారత్‌లో పౌర సేవలు

  • భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చిన ఈస్టిండియా కంపెనీ ఇంగ్లండ్‌ నుంచి తక్కువ జీతానికి మనుషులను తెచ్చుకుని ఇక్కడ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేది. ఈ ఉద్యోగులకు ప్రైవేటు వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఉండేది. బక్సర్‌ యుద్ధం తర్వాత బెంగాల్‌ రాజ్యాధికారం కంపెనీ చేతుల్లోకి వెళ్లింది. దీంతో ఉద్యోగ బృందం వ్యాపార కార్యకలాపాలతోపాటు పాలనా వ్యవహారాలు కూడా చూసేది. వీరికి లభించిన మితిమీరిన అధికారాల కారణంగా పాలనలో అవినీతి, లంచగొండితనం బాగా పెరిగాయి. దీన్ని అరికట్టే ఉద్దేశంతో తీసుకొచ్చిందే సివిల్‌ సర్వీసెస్‌ వ్యవస్థ. కాలక్రమేణా ఇది నిర్మాణాత్మక, వ్యవస్థీకృత అధికార యంత్రాంగంగా మారింది
  • ప్రారంభంలో ఇందులో మూడు స్థాయుల సర్వీసులు ఉండేవి: అవి: ఇంపీరియల్‌ సివిల్‌ సర్వీస్, ప్రావిన్షియల్‌ సివిల్‌ సర్వీస్, సబార్డినేట్‌ సివిల్‌ సర్వీస్‌
  • ఇంపీరియల్‌ సివిల్‌ సర్వీస్‌ అనేది అత్యున్నత స్థాయి. ఆ సమయంలో ముఖ్యమైన పాలనా పదవులకు బాధ్యత వహించేది. ప్రావిన్షియల్‌ సివిల్‌ సర్వీస్‌ రాష్ట్ర స్థాయిలో పాలన నిర్వహించగా.. సబార్డినేట్‌ సివిల్‌ సర్వీస్‌ అనేది రెవెన్యూ వసూలు, శాంతిభద్రతల అమలు లాంటి దిగువస్థాయి విధులు నిర్వహించేది. 

చారిత్రక నేపథ్యం:

  • సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ 1947, ఏప్రిల్‌ 21న దిల్లీలోని మెట్ కాల్ఫ్‌ హౌస్‌లో సివిల్‌ సర్వీసెస్‌ మొదటి బ్యాచ్‌ ప్రొబేషనర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన పౌర సేవకులను ‘భారతదేశ ఉక్కు చట్రం’గా (steel frame of India) అభివర్ణించారు. దీన్ని పురస్కరించుకుని ఆ తేదీన ‘పౌర సేవల దినోత్సవం’గా జరుపుకోవాలని 2006లో కేంద్రం తీర్మానించింది. అప్పటి నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు..

1. జాతీయ పౌర సేవల దినోత్సవాన్ని మొదటిసారి ఎప్పుడు నిర్వహించారు?(అగ్నివీర్‌ నేవీ ఎంఆర్, 2025)

1) 1947, ఏప్రిల్‌ 21    2) 2006, ఏప్రిల్‌ 21

3) 2006, మే 1       4) 2006, అక్టోబరు 2

సమాధానం: 2

2. జాతీయ పౌర సేవల దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?(ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌ డి, 2018), (ఆర్‌పీఎస్సీ ఆర్‌ఏఎస్‌ ప్రిలిమ్స్‌ 2015),(యూకేపీఎస్సీ ప్రిలిమ్స్, 2022), (ఓఎస్‌ఎస్‌సీ సీజీఎల్, 2022),(యూపీ పోలీస్‌ ఏఎస్‌ఐ, 2021)

1) నవంబరు 12           2) ఏప్రిల్‌ 21           3) మార్చి 21          4) జనవరి 15

సమాధానం: 2

3. In which year were the Indian Civil Service (ICS) and Indian Police (IP) replaced by the Indian Administrative Service (IAS) and Indian Police Service (IPS), later recognised as All-India Services?(RRB NTPC (UG) CBT-I 2025)

1. 1947           2. 1945           3. 1946          4. 1950

Answer: 1

4. In the context of British rule in India, who among the following Governor-Generals created a professional cadre of company servants making provisions for them for generous salaries?(SSC Selection Post 2024)

1. Lord Mayo          2. Lord Cornwallis

3. Lord Dalhousie       4. Warren Hastings

Answer: 2

5. Which British administrator sought "to make everything as English as possible in a country which resembles England in nothing", as recorded by Sir Thomas Munro?(UGC NET 2020)

1. Lord Bentick          2. Lord Hastings

3. Lord Cornwallis        4. Lord Wellesley

Answer: 3

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram