భూమిపై ఉండే వివిధ ప్రదేశాలు, పురాతన స్థలాలు, చారిత్రక కట్టడాలు, అపురూప కళాఖండాలు మొదలైనవన్నీ వారసత్వ చిహ్నాలే. ఇవి సాంస్కృతిక, చారిత్రక, సహజ ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. వీటిని రక్షించుకుంటూ, ఆ చారిత్రక వారసత్వాన్ని తర్వాతి తరాలకు అందించే బాధ్యత మనందరిదీ. ప్రస్తుత మానవ చర్యల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా అనేక అరుదైన ప్రదేశాలు, స్మారక చిహ్నాలు నాశనమవుతున్నాయి. దీన్ని అరికట్టి చారిత్రక ప్రాధాన్యం ఉన్న అన్ని అంశాలను రక్షించే లక్ష్యంతో ఏటా ఏప్రిల్ 18న ‘ప్రపంచ వారసత్వ దినోత్సవం’గా (World Heritage Day) నిర్వహిస్తారు. దీన్నే ‘ఇంటర్నేషనల్ డే ఫర్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్’ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోని వారసత్వ ప్రదేశాలను గుర్తించి, వాటి ప్రాముఖ్యతను చెప్పి, భవిష్యత్తు తరాల కోసం వాటిని రక్షించాల్సిన అవసరంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు అంటే?
ఉదా: ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్, ఈజిప్ట్ పిరమిడ్లు, టాంజానియాలోని సెరెంగెటి నేషనల్ పార్క్, తాజ్‌మహల్, అజంతా గుహలు మొదలైనవన్నీ యునెస్కో వారసత్వ ప్రదేశాల జాబితాలో ఉన్నాయి.
చారిత్రక నేపథ్యం: